తెర వెనుక గద్దర్ ?
హైదరాబాద్ : సాంబశివుడి లొంగుబాటు వెనుక ప్రజాగాయకుడి గద్దర్ ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజులుగా ఆయన ప్రభుత్వ, పోలీసు వర్గాలతో తీవ్ర చర్చలు జరపడం ఇందుకు కారణాలు. మావోయిస్టు ఖైదీల విడుదల పేరుతో ఆయన ముందుకెళ్ళినా, తెర వెనుక వ్యూహం మాత్రం సాంబశివుడిని అప్పగించడమనేది సుస్పంష్టంగా తెలుస్తోందని ఓ పోలీసు అధికారి విశ్లేషించారు. చర్చల అనంతరం పార్టీపై తీవ్ర నిర్బంధం విధించారు. విరసం నేతలను సైతం అరెస్టు చేసి, జైలుకు పంపారు. గద్దర్ ను కూడా అరెస్ట్ చేస్తామని అప్పటి డిజిపి స్వరణ్ జిత్ సేన్ అనేక సార్లు ప్రకటనలు చేశారు. కానీ ఆతర్వాత స్వరం కొంత తగ్గింది. దీనివెనుక నిఘా వర్గాల వత్తిడి ఉందనే ప్రచారం జరిగింది. అజ్ఞాతం వీడిన తర్వాత గద్దర్ ప్రతీ కదలికలపై నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. కళాకారుడిగా ఉంటూనే పార్టీకి తోడ్పడుతున్నాడని పోలీసులు సందేహించారు. అదీగాక పార్టీ పేరుతో ఆయన అనేక వ్యాపారలావాదేవీల్లో పాల్గొన్నాడని పోలీసు వర్గాలు సమాచారం సేకరించాయి. అయితే తెరాస కూటమిలో కలిసిన నేపథ్యంలో నిర్ణయాన్ని గద్దర్ పూర్తిగా వ్యతిరేకించారు. టిడిపిని దుయ్యబట్టారు. ఇది తెలంగాణా ప్రజల మనోభిష్టానికి విరుద్దమని ప్రకటనలు చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ కు కొంత అనూకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ నేతలు గద్దర్ ను కలుసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ అవకాశాన్ని గద్దర్ ఉపయోగించుకున్నాడనే వదదంతులు వస్తున్నాయి. కాంగ్రెస్ తో మేలు పొందాలని లేకున్నా, టిడిపిని దెబ్బకొట్టడం గద్దర్ ఎత్తుగడగా కన్పిస్తోందని నిఘా విభాగానికి చెందిన ఓ అధికారి ఉన్నారు. సాంబశివుడితో మొదటి నుంచి గద్దర్ కు సంబంధాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాంబశివుడిపై నిర్భందం పెరగడం, మరోపక్క అతని ఆరోగ్యం కూడా క్షీణించడంతో లొంగుబాటు కోసం గద్దర్ ద్వారా కథన నడిపాయని, లొంగుబాటు తర్వాత తెరాసకు వ్యతిరేకంగా సాంబశివుడితో ప్రకటన ఇప్పించే ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో గద్దర్ కీ రోల్ స్పష్టంగా ఉందని పోలీసు వర్గాల సమాచారం.
News Posted: 16 February, 2009
|