ఒబామా-1, జీసస్-2
చికాగో: హారిస్ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో జీసస్ పై అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆధిక్యత సాధించారు. అమెరికా నెం.1 హీరో పై జరిపిన అభిప్రాయ సేకరణలో ఒబామా అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాలో అత్యధికంగా జనాదరణ పొందిన 10 మంది వ్యక్తుల్లో ఒబామాకు ప్రథమ స్థానం దక్కగా, ఏసు క్రీస్తు రెండవ స్థానంలోను, మార్టిన్ లూథర్ కింగ్ మూడవ స్థానంలోను నిలిచారు. నాల్గవ స్థానంలో రోనాల్డ్ రీగన్, అయిదవ స్థానంలో జార్జ్ డబ్ల్యూ బుష్ లు నిలిచారు.ఆ తర్వాత ఆరవ స్థానంలో అబ్రహాం లింకన్, ఏడవ స్థానంలో జాన్ మెక్ కెయిన్, ఎనిమిదవ స్థానంలో జాన్ ఎఫ్ కెనడీ, తొమ్మిదవ స్థా నంలో చెస్లీ సుల్లెన్ బెర్జర్, పదవ స్థానంలో మదర్ తెరిస్సాలు నిలిచారు.
ఈ అభిప్రాయ సేకరణ ఆన్ లైన్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో 2,634 మంది అమెరికన్ వయోజనులు పాల్గొన్నారని చికాగో సన్-టైమ్స్ తెలిపింది. ఈ సర్వే కోసం ఎలాంటి పేర్లను అందించకుండా 'హీరోగా మీరు ఎవర్ని ఎంచుకుంటారు?' అన్న ప్రశ్నను మాత్రమే అడగడం జరిగింది. 2001లో కూడా హిరో నెం.1 ఆన్ లైన్ పోల్ ను హారిస్ సంస్థ చేపట్టింది. ప్రతిసారి జీసస్ ప్రధాన స్థానంలో నిలిచేవారు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్, కొలిన్ పావెల్, జాన్ ఎఫ్ కెనడీ, మదర్ థెరిస్సాలు వరుస స్థానాల్లో నిలిచేవారు. ఆనాటి అభిప్రాయ సేకరణలో బుష్ కు 19వ స్థానం దక్కింది. అయితే తాజా అధ్యయనంలో అయిదవ స్థానాన్ని దక్కించుకున్నారు. 2001లో జాన్ మెక్ కెయిన్ కు టాప్ 20 జాబితాలో స్థానం దొరకలేదు.అయితే ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉన్నారు. 2001న అయిదవ స్థానంలో ఉన్న మదర్ థెరిస్సా ప్రస్తుతం 10 వ స్తానంలో ఉన్నారు.
అమెరికా టాప్-10 హిరోలు:
1.బరాక్ ఒబామా, 2.ఏసు ప్రభువు, 3.మార్టిన్ లూథర్ కింగ్, 4.రోనాల్డ్ రీగన్, 5.జార్జ్ డబ్ల్యూ బుష్, 6.అబ్రహాం లింకన్, 7.జాన్ మెక్ కెయిన్, 8.జాన్ ఎఫ్ కెనడి, 9. చెస్లీ సుల్లెబర్జర్, 10. మదర్ థెరిస్సా.
News Posted: 20 February, 2009
|