కూటమిలో కోల్డ్ వార్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఢిల్లీ స్థాయిలో ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించామని భావిస్తున్న మహాకూటమి శనివారం హైదరాబాద్ చేరుకోగానే యీట్ల పంపకంపై దృష్టిసారించాలని నిర్ణయించింది. వైఎస్సార్, ఆయన కుమారుడి అవినీతి వ్యవహారాలపై జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంలో విజయవంతం అయినట్టు మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. 'పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జనం దృష్టికి తీసుకువెళ్లగలిగాం. ఎన్నికల్లో దీనికి ప్రజలే తగిన తీర్పు చెబుతారు' అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే ఈ నాయకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాక కూటమి పార్టీల మధ్య అసలు పోరు ప్రారంభంకానుంది.
ఉమ్మడి అజెండా, ఉమ్మడి ప్రచారం కోసం కెసిఆర్ చేసిన ప్రయత్నాలకు సిపిఎం విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది. మహా కూటమి ఏర్పాటులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కీలకపాత్రవహించారు. టి.ఆర్.ఎస్, సిపిఐలు ప్రజారాజ్యంవైపు మొగ్గుచూపినప్పటికీ, మహాకూటమిలోకి తొలుత సిపిఐని ఆకర్షించడంలో రాఘవులు కీలకపాత్ర వహించారు. సిపిఎం పెద్దన్న పాత్రప పోషిస్తోందని సిపిఐ విమర్శించినప్పటికీ చివరకు సిపిఎం దారికే వెళ్లక తప్పలేదు. టి.ఆర్.ఎస్ కూడా అదే దారిలో పయనించక తప్పలేదు.
మహాకూటమి ఏర్పాటులో కీలకపాత్ర వహించిన సిపిఎం ఇప్పుడు ఉమ్మడి అజెండాకు అడ్డు తగులుతోంది. ఉమ్మడి అజెండాను ప్రకటిస్తే అందులో ప్రధానంగా తెలంగాణకు ్నుకూలమని ప్రకటించవలసి వుంటుంది. దీనికి ససేమిరా అంగీకరించేది లోదని సిపిఎం ప్రకటించింది. ఉమ్మడి అజెండా వుంటుందని టి.ఆర్.ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. కాము తెలంగాణకు ్నుకూలంగానే ున్నామని, అయితే సిపిఎం తెలంగాణను వ్యతిరేకిస్తున్నందున ఉమ్మడి అజెండా సాధ్యంకాదని చంద్రబాబు ఇంతకుముమదే ప్రకటించారు. సిపిఎం వైఖరిపై టి.ఆర్.ఎసి నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో వుంది. ఉమ్మడి ప్రచారం సాగించినప్పటికీ సిపిఎం పోటీచేసే నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టాలని టి.ఆర్.ఎస్ నాయకులు కెసిఆర్ పై ఒత్తిడి తెస్తున్నారు. సిపిఎం అభ్యర్ధులపై టి.ఆర్.ఎస్ పోటీచేస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నది ఎలా వున్నా, ఇతర ప్రయోజనాలు వున్నాయని టి.ఆర్.ఎసి నాయకులు చెబుతున్నారు.
సమైక్యవాదానికి కట్టుబడి వున్నామని చెబుతున్న సిపిఎంకు మద్దతు ఎలా ఇస్తారని, కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న వారినుంచి టి.ఆర్.ఎస్ విమర్శలు ఎదుర్కొంటోంది. సిపిఐ తెలంగాణకు అంగీకరించినందున ఆ పార్టీతో ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రధానంగా సిపిఎంతో సమస్యలు తప్పవని భావిస్తున్నారు. వేర్వేరు విధానాలతోనే ఉమ్మడి ప్రచారం సాగించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీచేసినప్పుడు వామపక్షాలు పోటీచేసిన నియోజకవర్గాల్లో టి.ఆర్.ఎస్ కూడా పోటీచేసింది. ఒకవైపు టి.ఆర్.ఎస్ నేరుగా సిపిఎంపై పోటీకి సిద్ధపడుతుండగా, మరోవైపు కూటమిలోని పార్టీలకు వెన్నుపోటు భయం పట్టుకుంది. తెలంగాణ కూటమిలో నాయకులే భన్నాభిప్రాయాలతో వున్నప్పుడు తెలంగాణలో కూటమి పార్టీలకు ఓట్లు ఎలా మారుతాయని కొందరు అనుమానిస్తున్నారు.
News Posted: 20 February, 2009
|