ఎన్నారైల కోసం పోటాపోటీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల మద్దతు సంపాదించుకోడానికి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రవాస భారతీయుల(ఎన్.ఆర్.ఐ) సహాయం కోసం అర్రులు చాస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం ప్రభావానికి గురైన ఎన్నారైల సహాయానికి ఏర్పడిన ఈ డిమాండ్ వారికి బాగా కలిసి వస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన శేషగిరినే తీసుకుంటే, ఇండియాలో వున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఆయన ఉత్తరాలు రాస్తూ ఒక రాజకీయ పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నారై మిత్రులు, వారితో పరిచయాలు గల సన్నిహితుల మీద ఆధారపడిన రాజకీయ పార్టీలు ఓట్లు సంపాదించుకోడానికి వారి సహాయాన్ని అడుగడుగునా కోరుతున్నాయి.
మన దేశానికి, ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన ఎన్నారై తెలుగువారు ఇక్కడి సొంత గ్రామాలలో మంచి పలుకుబడి కలిగి ఉన్నారని, ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా వారికుందని, అందువల్ల తమ పార్టీ ఎన్నారై విభాగం ద్వారా వారి మద్దతు కోరుతున్నామని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్దన రెడ్డి చెప్పారు. దీని ఫలితంగా రాజకీయప్రచారాన్ని చేపట్టడం కోసం కొత్త వెబ్ సైట్లు కూడా పుట్టుకు వస్తున్నాయి. వారి వారి స్వస్థలాల్లో కాని, ఎంపిక చేసిన మరో చోట కానిఎన్నారైలకు ప్రచార సర్వీసులను ఆఫర్ చేస్తున్నామని, వారు పార్టీ సందేశాలను తమ పరిచయస్తులకు పంపిస్తారని అటువంటి వెబ్ సైట్ నిర్వహిస్తున్న సురేష్ తెలిపారు. వెబ్ సైట్లతో పాటు కొందరు ఎన్నారైలు లేఖల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు.
News Posted: 23 February, 2009
|