కంపెనీ మారినా అదే నంబరు
న్యూఢిల్లీ: తమ సెల్ నెంబరు మార్చవలసిన అవసరం లేకుండానే సెలి ఫోన్ వినియోగదారులు మొబైల్ కంపెనీలను మారే సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తోంది. అందుకోసం ప్రభుత్వం త్వరలో ఇద్దరు మొబైల్ ఆపరేటర్ల పేర్లను ప్రకటించనుంది. ఆ రెండు సంస్థల ద్వారా పలు సర్వీ ప్రొవైడర్లకు చెందిన వినియోగదారులకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎమ్ఎన్ పి) సదుపాయం అందుబాటులోకి వస్తుంది.వేలంలో విజేతలుగా నిలిచిన సంస్థలకు ఎమ్ఎన్ పి సర్వీసు లైసెన్సులను ప్రబుత్వం మార్చి 5వ తేదినాడు ప్రకటించనుంది. అప్పటి నుండి ఒక వారం రోజుల్లో వారికి ప్రభుత్వ ఆమోద పత్రాలను అందుతాయని ఒక ప్రభుత్వాధికారి తెలిపారు.
ఎమ్ఎన్ పి లైసెన్స్ పోటీలో అమెరికా సంస్థలు టెల్ కార్డియా, సినివర్స్ టెక్నాలజీస్ సంస్థలు ముందున్నాయి. వీటితోపాటు నూస్టార్, జిటిఎల్, టెక్ మహీంద్ర, టెక్ లెక్ సిస్టెమ్స్, ఐబిసి, సిడిఓటి సంస్థలు కూడా పోటీ ఉన్నాయి. విజేతలుగా నిలిచిన సంస్థలు సెల్ ఫోన్ వినియోగదారుల నెంబర్లతో కూడిన ఒక నెంబర్ పోర్టబిలిటీ డేటాబేస్ ను రూపొందిస్తాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు తమ నెట్ వర్క్ లను క్రియరింగ్ హౌస్ అడ్మినిస్ట్రేటర్ తో అనుసంధానం చేసుకోవడం ద్వారా డేటాబేస్ సమాచారానికి అందుబాటులోకి వస్తాయి.
దేశంలోని 22 టెలికామ్ సర్సిల్స్ లోని 11 సర్కిల్స్ కు చెందిన సెల్ ఫోన్ నెంబర్లకు ఈ క్లియరింగ్ హౌస్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా పోర్టబిలిటీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కోల్ కత, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలు ఆగష్టులోపు పూర్తయ్యే మొదటి ఫేజ్ పరిధిలోకి వస్తాయి. ఈ క్లియరింగ్ హౌస్ లను ఏర్పాటు చేసేందుకు విజేతలుగా నిలిచిన ఒక్కొక్క బిడ్డరు 100 కోట్ల రూపాయలను వెచ్చించ వలసి ఉంటుంది. ఈ పోర్టబిలిటి వల్ల సర్వీసు ప్రొవైడర్ల మధ్య పోటీ తీవమవుతుంది. దాంతో మెరుగైన సర్వీసులు, మైరుగై నెట్ వర్క్, నిరంతరం ఆధునీకరణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. వినియోగదార్లను నిలుపుకునేందుకు ప్రొవైడర్లు మెరుగైన సేవలు అందించడంలో పోటీ పడటమే కాకుండా, కాల్ చార్జీలు తగ్గించడంలో కూడా పోటీ పడే అవకాశముంది.అయితే వినియోగదారులు ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్ వర్క్ కు మారే సమయంలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
News Posted: 27 February, 2009
|