డబ్బుతో బ్యాట్-బ్యాలట్ వార్!
చెన్నై: ఒకవైపు టి20 క్రికెట్ సంబరాలు తెస్తున్న ఐపిఎల్ టోర్నమెంట్, మరోవైపు ఉత్కంఠభరితంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ఎండాకాలాన్ని మరింతగా మండించబోతున్నాయి. ఏప్రిల్ 16, మే 16 మధ్య 15వ సార్వత్రిక ఎన్నికలు; ఏప్రిల్ 10 నుంచి మే 24 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ టోర్నీ పోటాపోటీగా జనం ముందుకు దూసుకురాబోతున్నాయి. జనం ఊహాశక్తిని గౌరవిస్తూనే, పార్టీల ఆర్భాటపు ప్రచారంతోను, మెలితిరిగిన డబ్బు యంత్రాలతోను బూత్, బ్యాట్ సమరాలు 'మరీ అతిగా' కనిపిస్తుంటే ఆశ్చర్యపోకండి. రాజకీయ ర్యాలీలకు హాజరు కావాలా లేక క్రికెట్ పోటీలకు వెళ్ళాలా లేక పోలింగ్ కేంద్రాలు, స్టేడియాల వద్ద ఎన్నికల కమిషన్, ఐపిఎల్ నిర్వాహకులు నియోగించే వేలాది మంది భద్రతా సిబ్బంది మధ్య పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని ఎలా వెతకాలా అనే డైలమా గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు.
ఇది ఆర్థిక వ్యవస్థ గురించి చర్చా కాదు. వనరులకు కొరత ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలా అనే మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే సైన్స్ గురించిన చర్చా కాదు. ఈ ఆర్థిక మాంద్యం సమయంలో డబ్బుకు గల ప్రాధాన్యం గురించే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మెరుగైన భవిత కోసం జాతి పెట్టుకున్న ఆశలతో ఆడుకునే ఖద్దరు ధారులకు, ఫ్లడ్ లిట్ స్టేడియాలలో రంగు రంగుల పైజామాలు ధరించి ఆడే క్రీడాకారులకు పుష్కలంగా ఆ వ్యక్తులే నిధులు సమకూరుస్తుంటారు. డబ్బు సంచులు ఇతోధికంగా ఉన్న సంస్థలు ఖద్దరుధారులకు వోటు వేయవచ్చు. క్రికెట్ ఒక క్రీడ మాత్రమే. కాని బడా వాణిజ్యవేత్తలను వాణిజ్య లావాదేవీలు కొనసాగించేటట్లు చేసే క్రీడ రాజకీయం.
Pages: 1 -2- -3- News Posted: 3 March, 2009
|