కేకలేసే లాప్ టాప్
లండన్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరాయంగా కొత్త పుంతలు తొక్కుతోంది. దొంగతనానికి గురైన లాప్ టాప్ 'ఆగు, దొంగ' అని పెద్దగా కేకలేయడం ఆశ్చర్యం.'ఫ్రంట్ డోర్ సాప్ట్ వేర్ కార్పొరేషన్' అనే సాప్ట్ వేర్ సంస్థ ఒక తమాషా అయిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ను అభివృద్ది చేసింది. లాప్ టాప్ దాని యజమాని నుండి జారిపోయినట్లు గుర్తిస్తే లాప్ టాప్ 'స్టాప్, థీఫ్' అని కేకలేస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంను 'రిట్రీవర్' గా పిలుస్తారు.
ఈ రిట్రీవర్ సాప్ట్ వేర్ 21 పౌండ్ల ధర పలుకుతోంది. జారిపోయిన కంప్యూటర్ స్క్రీన్ పైన మిస్సింగ్ అలర్టులను వినియోగదారులు రూపొందించవచ్చు. ఈ అలెర్టుల్లో భాగంగా పెద్ద పెద్ద కేకలేయడం కూడా ఒక ఆప్షన్ గా ఉంటుంది. కోల్పోయిన లాప్ టాప్ లను కనుగొనేందుకు వీలయ్యే సాప్ట్ వేర్ లు మార్కెట్ లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే రికార్డ్ చేసిన సందేశాలను లాప్ టాప్ లో పొందుపరిచే సౌకర్యం మొదటిసారిగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని 'ది టైమ్స్' పత్రిక తెలిపింది.
ఈ లాప్ టాప్ లోని నిర్దేశిత బాక్స పై దాని యజమానులు కంప్యూటర్ కోల్పోయిన ఆప్షన్న్ పై టిక్ చేయాలి. యజమానులు చేతి నుండి జారిపోయి వేరొకరి చేతికి కంప్యూటర్ వెళ్లినపుడు, లాప్ టాప్ ను ఆన్ చేయడంతోనే 'ఈ లాప్ టాప్ జారిపోయింది. లేదా దొంగలించబడింది' అనే వాక్యం రాసిన ఎర్రటి, పసుపు పచ్చటి బ్యానర్ కంప్యూటర్ తెరపై సాక్షాత్కరిస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేరీ హాఫెమన్ తెలిపారు. ఈ సందేశం ప్రతి 30 సెకన్ల కొకసారి తెరపై ప్రత్యక్షమవుతుంది. అయితే తాజా నమూనాలో మాటల సందేశాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. 'ఈ లాప్ టాప్ ను జారి పోయింది లేక దొంగలించారు. మీరు నా యజమాని కానట్లయితే ఆయనకు వెంటనే ఈ విషయాన్ని తెలియజేయండి' అన్న మాటల సందేశాన్ని లాప్ టాప్ పదే పదే విడుదల చేస్తుంది. ఈ మాటల సందేశాన్ని కేకలేసే 'రిట్రీవర్' ప్రోగ్రామ్ ను మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్ పి, విస్టా, మాక్ వినియోగదారులకు కూడా ఉపయోగించుకునే వీలుంటుందని హఫెమన్ తెలిపారు
News Posted: 3 March, 2009
|