దుబాయ్: ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో ప్రవాసులు బతుకులు ప్రశ్నార్ధకంగా మారాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఐ-దుబాయ్)లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో నలభై శాతం మంది వచ్చే ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నట్లు ఒక సర్వే తెలియజేస్తోంది. యుఏఈలోని 40 లక్షల మందిలో ముప్పావు వంతు మంది ప్రవాసులు. ఈ ప్రవాసుల్లో దాదాపు 15 లక్షల మంది భారతీయులే. ప్రవాసుల్లో అయుదు వంతల మంది వచ్చే 12 నెలల కాలంలో ఉద్యోగాలు కోల్పోతామనుకుంటున్నారు. ఎనిమిది శాతం మంది ఇప్పటికే నిరుద్యోగులయ్యామని భావిస్తున్నారు.
భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున స్వదేశానికి తరలి వస్తే విదేశీ మారక ద్రవ్య రెమిట్టన్స్ లకు పెద్ద దెబ్బ తగులుతుంది. వీరి స్వదేశ ఆగమనం దేశంలోని ఉద్యోగ మార్కెట్ పై, గృహ వసతిపై ఒత్తిడి తీవ్రతరమవుతుందని భావిస్తున్నారు. స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాసులకు పలు రకాల ప్యాకేజిలను కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించంది. ఖర్చుకు తగిన విద్య తమ పిల్లలకు అందడం లేదని 77 శాతం మంది ప్రవాసులు భావిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. ఎమిరేట్స్ లో విపరీతంగా పెరిగి పోయిన జీవన ప్రమాణాల పట్లు 75 శాతం మంది ప్రవాసులు అసంతృప్తితో ఉన్నట్లు అదే సమయంలో 45 శాతం మంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. తమ సంపాదనలో గణనీయమైన భాగం గృహ వసతికి ఖర్చు చేయవలసి వస్తున్నట్లు 62 శాతం ప్రవాసులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 34 శాతం మంది ప్రవాసులు వచ్చే ఏడాది తాము సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు రియల్ ఒపీనియన్స్ కంపెనీ సిఈఓ డాన్ హీలే తెలిపారు. ఫ్రిబ్రవరి 11-18 మధ్యకాలంలో ఈ సర్వేని 500 ప్రవాసల్లో నిర్వహించారు.