అల్లుకు కాకినాడ దక్కేనా?
జమండ్రి: ఉభయ గోదావరి జిల్లాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్రజారాజ్యం పార్టీ ఈ రెండు జిల్లాల్లో అగ్రనాయకులను పోటీకి దింపాలని భావిస్తున్నారు. రెండింటిలో ేదా ఒక జిల్లానుంచి పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని పార్టీ అధినేత చిరంజీవి ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలోనే ాయన బావమరిది అల్లు అరవింద్ ను కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపితే ఎలా ఉంటుందని పార్టీ ఆలోచిస్తోంది. అందుకు అనుకూల పరిస్థితులనుస అవకాశాలను ప్రజారాజ్యం అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది. తాను తిరుపతి నుంచి పోటీ చేస్తానని చిరంజీవి ఇప్పటికే చెప్పారు. రెండో స్థానం పశ్చిమ గోదావరిలోని స్వగ్రామం మొగల్తూరు ున్న నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో తమకు అండగా ఉంటుందనుకుంటున్న తూర్పు గోదావరి జిల్లాలో కూడా మరో అగ్ర నయకుడిని పోటీకి దింపితే బాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలిసింది. అది కాకినాడ నయోజకవర్గం అయితే ఇంకా బాగుంటుందని భావిస్తున్నారు. జిల్లాలోని మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో మూడు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపడం ద్వారా, పార్టీ సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని పాటించాలని భావిస్తున్నారు. ఈ సమీకరణంలో భాగంగానే అల్లు అరవింద్ పేరును కాకినాడ నియోజకవర్గానికి ప్రతిపాదిస్తున్నారని తెలిసింది. ఇంకొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
News Posted: 4 March, 2009
|