ఫ్రంట్ ర్యాలీకి జయ డుమ్మా?
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ప్రకటించిన తృతీయ ఫ్రంట్ ఆవిర్భావ సభకు ఎఐఎడిఎంకె అధినేత్రి జె జయలలిత డుమ్మా కొట్టనున్నారు. బెగుళూరులో జరుగనున్న ఈ సభకు సిపిఎం, పార్వర్డ్ బ్లాక్ నాయకులు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టిఆరెస్ నాయకుడు చంద్రశేఖరరావు హాజరవుతారని ధ్రువీకరించిన దేవెగౌడ జయలలిత నుండి ఎటువంటి సమాచారం అందలేదన్నారు. తృతీయ ఫ్రంట్ ప్రారంభానికి బెంగుళూరును వేదికగా ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు ఫాసిస్టు శక్తులపై పోరాటానికని, బీజెపి అధికారంలో వున్న ఏకైక రాష్ట్రం కర్నాటక అని ఆయన బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. జయలలిత రాకను ధ్రువీకరించడానికి ఆమె పార్టీ వర్గాలు నిరాకరించాయి.
ఎఐఎ డిఎంకె తృతీయ ఫ్రంట్ లో చురుకైన సభ్యత్వం స్వీకరించలేదన్న వాదనను దేవెగౌడ ఖండించారు. 'ఆమె మూడో ఫ్రంట్ కు పూర్తిగా సహకరిస్తారని నేను నూు శాతం విశ్వసిస్తున్నాన'ని ఆయన అన్నారు. నాయకులందరికీ ఆహ్వాన పత్రాలు పంపించామని, ర్యాలీలో పాల్గొనాలని జయలలితను కూడా కోరామని ఆయన చెప్పారు.
News Posted: 5 March, 2009
|