అటల్జీ అప్పీలు అద్వానీకేదీ?
న్యూఢిల్లీ: దేశంలో యవజనులను విశేషంగా ఆకర్షిస్తున్న రాహుల్ గాంధీ చరిష్మా కావచ్చు, లేదా ఆర్ధిక మాంద్యం ప్రభావం కావచ్చు, కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో తమకూ పాల్గొనే అవకాశం ఇవ్వాలని ప్రపంచం నలుమూలల నుండీ యువ ప్రొఫెషనల్స్ పంపే విజ్ఞప్తులకు అంతు లేకుండా ఉంది. పార్టీ కార్యకలాపాలమీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం కోసం గత నెల కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న జైరామ్ రమేశ్ రోజుకు సుమారు 50 ఎస్సెమ్మెస్ లు అందుకుంటున్నారు. వాటిని పంపిస్తున్నది ఐఐటి గ్రాడ్యుయేట్ లు, ఎంబిఏలు, బ్యాంకర్లు, ఇతర ప్రొఫెషన్స్ కు చెందినవారు. వారిలో అమెరికా, దుబాయ్, జర్మనీ తదితర దేశాలకు చెందనవారు కూడా ఉంటున్నారు. 'నేను మంత్రి పదవిని విడిచిపెట్టిన నాలుగు రోజుల్లో మా ప్రచారంలో పాల్గొంటామని కోరుతూ 240 ఇ-మెయిల్స్ అందాయి. ఇలా 2004లో కూడా జరిగింది. ఈసారి వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంది' అని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంబంధిత వ్యవహారాల శాఖ సమన్వయ కర్త అయిన జైరామ్ రమేశ్ చెప్పారు.
రాహుల్ గాంధీ యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలను ఉత్తేజితులను చేసిన కారణంగా తమకు జనం లోటు లేదని, ఇప్పడు ఆసక్తి చూపుతున్న యువ ప్రొఫెషనల్స్ సంఖ్య పెరిగిపోతుండడానికి ఆర్ధిక మాద్యం కూడా కొంతవరకు కారణం కావచ్చని రమేశ్ అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రచారంలో అత్యంత ముక్యమైన అంశం యుపుఎ ప్రభుత్వం సాధించిన విజయాలు. 2004లో 'వాగ్దానాలు' ప్రచారాస్త్రం అయితే, ఇప్పుడు వాటిని 'అమలు'చేసిన తీరు గురించి విశేషంగా చెప్పుకోనున్నారు. 'ఎన్.ఆర్.ఇ.జి.ఎ అమలుపరుస్తామని వాగ్దానం చేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. అది కూడా 2002 సంవత్సరం నాటిది. ఆ యేడాది ఏప్రిల్ 11న గౌహతిలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఆ పథకానికి అంకురార్పణ జరిగింది. ఇప్పుడు దాని గురించి వామపక్షాలు బాజా కొట్టుకుంటున్నాయి. అలాగే ఆర్.టి.ఐ, మధ్యాహ్న భోజన పథకం అమలుకు వాగ్దానం చేసింది కూడా మేమే. చెప్పుకోవాలంటే ఇలాంటి ముఖ్యమైన కథలెన్నో ఉన్నాయి' అని జైరామ్ వివరించారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|