వైఎస్ జేబులో జాతకాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు కూడా, ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీ బయలుదేరారు. టిక్కెట్ల వ్యవహారం ఢిల్లీకి మారడంతో నిన్నటి వరకి నేతలు కార్యకర్తలతో హడావిడిగా వున్న గాంధీ భవన్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, నగరంలోని హోటళ్లు బోసిపోయాయి. గత మూడు రోజులుఅభ్యర్ధుల జాబితాలపై కసరత్తు చేసిన వైఎస్, డిఎస్, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు ఆదివారం కూడా ముఖ్యమంత్రి నివాసంలో సమాలోచనలు జరిపారు. తొలి జాబితాలో ప్రకటించడానికి వీలుగా వంద పేర్లను వారు ఎంపిక చేశారని తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే తమ భవిష్యత్తు తెలిపోనుండడంతో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
కాంగ్రెస్ లో సాధారణంగా ఒకరిద్దర్ని మినహాయిస్తే సిటింగులందరికీ మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం ఆనవాయితీ. కాని ఈ సారి 60 మంది వరకూ సిటింగులకు టిక్కెట్లు వచ్చే అవకాశం లేదని రాజశేఖరరెడ్డి ప్రకటించడంతో చాలా మంది ఆందోళన పడుతున్నారు. టిక్కెట్ దక్కే ్వకాసం లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలిసింది. వారిలో కొందరు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్లు దక్కేలా ప్రయత్నిస్తుండగా , ఇంతకాలం పార్టీకోసం కష్టపడుతున్న తమను కాదని మళ్లీ పాత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తే ఎలా అని మంరికొందరు ప్రశ్నిస్తున్నారు. సిటింగులను మార్చాలనుకున్నప్పుడైనా తమకు అవకాశం ఇవ్వాలంటున్నారు.
News Posted: 9 March, 2009
|