ఆస్తులు అమ్ముకున్న 'టైమ్స్'
న్యూయార్క్: తన ప్రధాన కార్యాలయాన్ని 225 మిలియన్ డాలర్లుకు అమ్మివేసినట్లు ప్రముఖ మీడియా దిగ్గజం న్యూయార్క్ టైమ్స్ సోమవారంనాడు ప్రకటించింది. తన ప్రధాన కార్యాలయాన్నితిరిగి తానే ఏడాదికి 24 మిలియన్ డాలర్ల అద్దెకు తీసుకునింది. ఈ మీడియా దిగ్గజం న్యూయార్క టైమ్స్, ది ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, ది బోస్టన్ గ్లోబ్ లాంటి పలు దినపత్రికల్ని నడుపుతోంది. 2007 రెన్జో పియానో డిజైన్ చేసిన బిల్డింగ్ 21 అంతస్తుల్లో ఈ సంస్థ పత్రికలు విస్తరించి ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ సంస్థ యాడ్ ఆదాయాలు గణనీయంగా పడిపోవడం, రుణాలు దొరక్కపోవడంతో కంపెనీ ఆర్ధిక పరిస్థితి విషమంగా మారింది. దాంత న్యూయార్క్ టైమ్స్ సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని అమ్ముకోవలసి వచ్చింది.ఈ కార్యాలయ ప్రదేశాన్ని న్యూయార్క్ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ బ్యాంకు డబ్ల్యూపి కేరీ అండ్ కో సంస్థ కొనుగోలు చేసింది.
News Posted: 10 March, 2009
|