రాజకీయవేత్తల శిక్షణా సంస్థ
రాంచి: రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారా? దానికి మీరు అగ్రనేతల రక్తసంబంధీకులే కానక్కర్లేదు. డాన్స్ స్కూలు, యాక్టింగ్ స్కూల్, ఆర్ట్ స్కూల్స్ లా రాజకీయ నాయకులను తయారు చేసేందుకు రాంచీ వద్ద నేతాగిరి విద్యాలయం అనే స్కూలును 2001లో నెలకొల్పారు. ఇంతవరకు ఈ స్కూలులో 200 మంది ఆశావహులైన రాజకీయనాయకులు శిక్షణ పొందారు. ఈ స్కూలును మాజీ కాంగ్రెస్ నాయకుడు రాజ్ రంజన్ నడుపుతున్నారు. 'లంచగొండితనాన్ని నిర్మూలించాలంటే మనుషుల మనస్సుల్లో రాజకీయ ఆలోచనను లోతుగా చొప్పించాలి' అని రాజ్ రంజన్ అభిప్రాయపడుతున్నారు.
'ఔత్సాహిక రాజకీయవేత్తలైనా, ప్రముఖ రాజకీయ నాయకులైనా రాజకీయ శాస్త్రాన్ని అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. పార్టీ ప్రణాళికను, దాన్ని అమలు చేసే విధానాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది' అని మాజీ పిసిసి కార్యదర్శి రంజన్ తెలిపారు. విద్యార్ధుల నుండి 50 రూపాయలను ఈ విద్యాలయం ప్రవేశ రుసుంగా వసూలు చేస్తుంది. ప్రతి శనివారం రెండు గంటలపాటు 'నేతాగిరి' గురించి విద్యార్ధులకు బోధిస్తారు. '69 ఏళ్ల ఒక ప్రాంతీయ పార్టీ నేత సుఖదేవ్ లోహ్రా ప్రస్తుత సెషన్ లో విద్యార్థిగా చేరడం చాలా ఆశ్చర్యంగా ఉంది' అని మాజీ కాంగ్రెస్ ఎమ్ పి స్వర్గీయ గ్యాన్ రంజన్ సోదరుడు రాజ్ రంజన్ తెలిపారు.
News Posted: 19 March, 2009
|