లోకేష్ కు బ్రహ్మరథం
రామకుప్పం: కుప్పం నియోజకవర్గంలో తన తండ్రికి ఇస్తున్నట్టే తనకూ గౌరవం ఇస్తున్నారని, ఇదే అబిమానం ఎన్నికల్లో చూపించి భారీ మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలల్ రోడ్ షో నిర్వహించిన లోకేష్ తెలుగుదేశం తరఫున ప్రచారం చేసినప్పుడు మహిళలు అడుగడుగునా మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల అభివృద్ధితో పాటు నిరుపేదలకు 2,000 రూపాయలు, పేదలకు 1,500 రూపాయలు, మధ్య తరగతి వారికి 1,000 రూపాయలు ఇస్తున్నట్టు చెప్పారు. పిల్లల తెలివితేటలు పెరగడానికి, రైతుల సమస్యలు పరిష్కాలు సూచించడానికి కలర్ టెలివిజన్లను తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తుందని ఆయన చెప్పారు. పేద వధువులకు మూడు గ్రాముల చొప్పున బంగారం ఇస్తామన్నారు.
కాంగ్రెస్ పాలనలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, పులివెందులకే వేల కోట్ల రూపాయలు ఇస్తూ మిగిలిన నియోజకవర్గాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని లోకేష్ ఆరోపించారు. 12 కోట్ల రూపాయల జడ్పీ నిధులు గల కుప్పం నియోజకవర్గాన్ని ఎక్కడ అబివృద్ధి చేశారని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి ఇస్తామని చెప్పిన ఉచిత విద్యుత్ ను సక్రమంగా ఇవ్వడం లేదని తెలిపారు.
News Posted: 6 April, 2009
|