కీడులో మేలు
హైదరాబాద్ : విధి రాత అనండి లేదా కీడులో మేలు అనండి. ఏదైనా కాని తెలుగు దేశం పార్టీ (టిడిపి) 'స్టార్' ప్రచారకుడు, జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదం ఎన్టీఆర్ కుటుంబాన్ని తిరిగి ఒకటి చేసింది. కుటుంబ వేడుకలకు దూరంగా ఉంచిన జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి శాలిని ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబానికి ఎంతో కావలసినవారు అయ్యారు.
మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ అంటే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జయకృష్ణ, మోహనకృష్ణ, తారకరత్న తదితరులు, మీడియా ప్రముఖుడు రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఇతరులు సికింద్రాబాద్లోని కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.'జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదం ఒక కుటుంబాన్ని తిరిగి ఏకం చేసిందనేది నిజం. నటుడు చిరంజీవి తరువాత అమితంగా జనాన్ని ఆకట్టుకునేది తానేనని ఆయన నిరూపించారు' అని టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
News Posted: 14 April, 2009
|