సంకేతాల ప్రచారం
హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలకు రంగం సిద్ధం కాగా ప్రచారానికి గడువు ముగిసినందున రాజకీయ పార్టీలు వోటర్లలో తమ ప్రభావాన్ని నిలిపి ఉంచుకోవడానికై వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ నెల 15న (బుధవారం) అంతా పసుపు రంగు దుస్తులు ధరించవలసిందిగా తన కార్యకర్తలు, నాయకులను తెలుగు దేశం పార్టీ (టిడిపి) కోరింది. పసుపు శుభసూచకం కనుక పసుపు రంగు దుస్తులు ధరించవలసిందని జనాన్ని కోరుతూ టిడిపి రెండు కోట్ల ఎస్ఎంఎస్ లను పంపింది. 'టిడిపి రాష్ట్రానికి శుభదాయకం. సైకిల్ కు - నారా చంద్రబాబు నాయుడుకు వోటు వేయండి' అనేది ఒక ఎస్ఎంఎస్.
చివరి రెండు రోజులూ ఎన్నికల ప్రచారంపై సాగించడంపై ఆంక్షలు ఉన్నందున టిడిపి పార్టీకి వోటు వేయవలసిందిగా వోటర్లకు సూచించడం కోసం పసుపు రంగు దుస్తులు ధరించవలసిందని కార్యకర్తలు, నాయకులను కోరవలసి వచ్చింది. ఇక ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) మొబైల్ ఫోన్ ద్వారా వోటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఆపరేటర్ లోగోను స్వీకరిస్తారా అని యూజర్లను కోరుతూ నెట్ వర్క్ ఆపరేటర్ ఒక బిజినెస్ కార్డ్ సందేశం పంపుతారు. లోగో ఏదై ఉంటుందో ఆ సందేశం సూచించదు. ఎవరైనా యూజర్ ఆ సందేశాన్ని స్వీకరిస్తే ప్రజారాజ్యం ఎన్నికల గుర్తు 'రైలు ఇంజన్' మొబైల్ ఫోన్ పై ప్రత్యక్షం అవుతుంది. దాని కింద ప్రజారాజ్యం పార్టీ అని తెలుగులో రాసి ఉంటుంది. యూజర్ చేతితో సెట్టింగ్ లను మార్చి, ఆపరేటర్ లోగోను స్విచాఫ్ చేసేంత వరకు అది మొబైల్ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటుంది.
News Posted: 15 April, 2009
|