'లేమన్' అణు నిల్వలు
న్యూయార్క్: దివాళా తీసిన లేమన్ బ్రదర్స్ సంస్థ ప్రమాదకరమైన గృహ రుణాలను కలిగి ఉండడమే కాదు, ప్రమాదకరమైన అణు నిల్వలను సైతం కలిగి ఉంది. అణు విద్యుత్ కర్మాగారాలను, అణు ఆయుధాలను తయారు చేయగల యురేనియం రేడియోధార్మిక పదార్ధం (yellow cake) 50 వేల పౌండ్ల నిల్వలను కలిగి ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. లేమన్ బ్రదర్స్ కు బుష్ ప్రభుత్వం బెయిల్ అవకాశాన్ని కల్పించక పోవడంతో ఆ సంస్థ గత ఏడాది సెప్టెంబర్ లో దివాళాను ప్రకటించింది.
దివాళా తర్వాత లేమన్ బ్రదర్స్ తన బ్రోకరేజ్ వ్యాపారాన్ని బర్కలేస్ సంస్థకు అమ్మివేయగల్గింది. అయినప్పటికి 100 కోట్ల డాలర్ల విలువ చేసే యురేనియం నిల్వలతో, 200 బిలియన్ డాలర్ల గృహ రుణాలతో (sub-prime) లేమన్ మిగిలింది. 'జన హనన ఆయుధాల కోసం మనం తప్పుడు అడ్రెస్ లో అన్వేషించాం. ఇరాక్ లో అన్వేషించడం పొరపాటు. అలాంటి ఆయుధాలు ఇరాక్ లో లేవు. లేమన్ బ్రదర్స్ గోడౌన్లలో అలాంటి ఆయుధ నిల్వలున్నాయి' అని న్యూయార్క్ పోస్ట్ పత్రిక వ్యాఖ్యానించింది. లేమన్ బ్రదర్స్ వద్ద ఉన్న యురేనియం నిల్వలతో అణు ఆయుధాన్ని తయారు చేసేందుకు సరిపోతుంది.
'వాల్ స్ట్రీట్ ప్రతిష్టను మంటగలిపే విధంగా ప్రమాదకరమైన గృహ రుణ నిల్వల కంటే ఈ యురేనియం నిల్వలు మరింత ప్రమాదకరమైనవి. లేమన్ బ్రదర్స వద్ద యురేనియం (yellow cake) నిల్వలు ఉండడమే కాదు, వాటిని దిగమింగింది కూడా. యురేనియం ఖనిజంతో ఎవరూ వ్యాపారం చేయకూడదు. నార్త్ కొరిమా మినహాయించి, లేమన్ బ్రదర్స్ ప్రకటించన ధరకు ఖనిజాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. యురేనియం మార్కెట్ కు చాలా గిరాకీ తగ్గింది. దివాళా తీసిన బ్యాంకు అణు పదార్ధం కెనడా దేశం గోడౌన్లలో నిల్వ ఉంది.' అని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో కెనడా మూడవ స్థానంలో ఉంది.
News Posted: 16 April, 2009
|