వారికి ఇది అగ్ని పరీక్ష
హైదరాబాద్ : బండారు దత్తాత్రేయ (బిజెపి), అసదుద్దీన్ ఒవైసి (ఎంఐఎం), మంత్రి ఎం. ముఖేష్ గౌడ్ (కాంగ్రెస్), తలసాని శ్రీనివాస యాదవ్ (టిడిపి) వంటి ప్రముఖ రాజకీయ నాయకులకు ఇది అనుభవైకవేద్యమే. మొట్టమొదటిసారిగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్న 50 మందికి పైగా అభ్యర్థులకు ఇది అగ్నిపరీక్ష. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలలో మొదటి దశ పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ ద్వారానే వారి భవిష్యత్తు తేలుతుంది.
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న 68 సంవత్సరాల జహీద్ అలీ ఖాన్ (టెడిపి), జవేరి కుటుంబానికి చెందిన సమీ మహమ్మద్ (బిఎస్పి) నుంచి సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో బరిలో ఉన్న నటి, రాజకీయ నాయకురాలు జయసుధ (కాంగ్రెస్) వరకు ఈ ఎన్నికలలో తొలిసారిగా పోటీచేస్తున్న ప్రముఖ వ్యక్తులలో ఉన్నారు. అటువంటి ఇతర ప్రముఖులలో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, జూబ్లీ హిల్స్ అభ్యర్థి మహమ్మద్ సలీమ్, సుదీష్ రాంభొట్ల, నిజామ్ నవాబుల కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఇమ్దాద్ జాహ్ బహదూర్ కూడా ఉన్నారు వీరిలో చివరి ఇద్దరు సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బరిలో ఉన్నారు.
మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నాయకులను ఢీకొంటున్న ఈ తొలిసారి అభ్యర్థులకు ఇది నిజంగా అగ్నిపరీక్షే. వీరి భవితవ్యాన్ని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి సేకరించిన గణాంక వివరాల ప్రకారం, 23 సంవత్సరాల లోపు వయస్సుగల యువజనులు 2004 నుంచి ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి కూడా ఇవే తొలి ఎన్నికలు.
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 113 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ, (కాంగ్రెస్), కలర్ టివిలు, నగదు బదలీ (టిడిపి), బాలికలకు నగదు సదుపాయాలు (బిజెపి) వంటి పేదల అనుకూల సంక్షేమ పథకాలు ఆ స్వతంత్ర అభ్యర్థుల ఉత్సాహాన్ని ఏమాత్రం నీరు కార్చలేదు. ఎందుకంటే వారు 'స్వతంత్రులు' కదా.
News Posted: 16 April, 2009
|