మౌనం వీడిన వాజపేయి
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి ఎల్.కె. అద్వానీ ఈ సార్వత్రిక ఎన్నికలలో తాను వారసుడు కావాలనుకుంటున్న నాయకుని నుంచి ఎట్టకేలకు ఆమోదముద్ర పొందారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ఎట్టకేలకు తన మౌనముద్ర వీడి తన చిరకాల మిత్రుడు అద్వానీకి బాసటగా నిలవడానికి ముందుకు వచ్చారు. అద్వానీకి ఓటు వేయవలసిందిగా వాజపేయి ఓటర్లకు ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు.
'ఎల్.కె. అద్వానీ సారథ్యంలోని బిజెపికి ఓటు వేయవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానిగా అద్వానీ బాగా రాణించగలరని, అందుకు ఈ ఎన్నికలు సరైన అవకాశం కల్పిస్తాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను' అని వాజపేయి తెలిపారు.
వాజపేయి, అద్వానీ జోడీని అభినవ రామలక్ష్మణులుగా అభివర్ణిస్తుంటారు.
News Posted: 16 April, 2009
|