ఒబామా... కాదు ఒసామా!
ముంబై : భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాని అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీకి మాటలు తడబడుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రేరకుడుగా అపఖ్యాతి పాలైన ఒసామా బిన్ లాదెన్ అనడానికి బదులు అద్వానీ శుక్రవారం ఒక కార్యక్రమంలో 'ఒబామా బిన్ లాదెన్' అనే పేరు ప్రస్తావించారు.
అద్వానీ విలేఖరుల గోష్ఠిలో ప్రసంగించిన సందర్భంలో, అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాదెన్ కు నిధులు అందుతున్న పన్ను స్వర్గధామాలను లక్ష్యం చేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఒసామా అని అనడానికి బదులు 'ఒబామా బిన్ లాదెన్' అని అద్వానీ అన్నారు.
News Posted: 17 April, 2009
|