పిఆర్పీ నుంచి వలసలు?
హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినందున ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) నుంచి మరింత మంది నాయకులు వలస వెళ్ళే అవకాశం ఉందా? అటువంటి అవకాశం లేకపోలేదని పార్టీలో పరిస్థితుల గురించి తెలిసిన వర్గాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ నాయకులు కొందరు చాలా కాలంగా అసంతుష్టి చెంది ఉన్నారని, తమ ఉద్దేశాలు బయటపెట్టడానికి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వారు వేచి ఉన్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
అలా పార్టీ నుంచి నిష్క్రమించవచ్చని భావిస్తున్న నాయకులలో పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా కూడా ఉండవచ్చు. ఆయన కొంత కాలంగా నలుగురి ముందుకు రాకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రెండు వారాల క్రితం విలేఖరుల గోష్ఠిలో పార్టీ అధినేత చిరంజీవి ఇంకా పార్టీలోనే ఉన్నారా అని డాక్టర్ మిత్రాను అడిగి అందరినీ కంగు తినిపించారు కూడా.
ఇంకా ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు కూడా పార్టీని వదలి వెళ్ళేందుకు యోచిస్తున్నారని కూడా తెలుస్తున్నది. అయితే, వారు తమ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టం కాలేదు.
News Posted: 24 April, 2009
|