బిపిఒల్లో 'ఓల్డీ'లకు గుడ్ బై?
హైదరాబాద్ : జీవితం 40 వద్ద ప్రారంభం అవుతుందని ఒక ఆశావాది ప్రకటించాడు. లేక అది వాస్తవమేనా? మనం దృక్పథంపై అది ఆధారపడి ఉఁటుంది. లేదా మనం నివసిస్తున్న కాలాన్ని బట్టి అది మారుతుండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం బిపిఒల రంగ ప్రవేశం 40 దాటినవారికి, ముఖ్యంగా కెరీర్ మధ్యలో సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్న మాజీ సైనికులకు కొత్త జీవనాన్ని ప్రసాదించింది. అయితే, కాలం మారిపోయింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రతి పరిశ్రమను కుదిపివేస్తుండడంతో బిపిఒలలో 40 దాటినవారు గొడ్డలి వేటును ఎదుర్కొంటున్నారు.
2007లో 50 సంవత్సరాల బ్రిగేడియర్ సురేష్ కుమార్ రక్షణ శాఖ ప్రకటించిన ఉద్వాసితుల జాబితాలో తన పేరును చూసుకున్నప్పుడు ఆయన అయిష్టంగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తు బిపిఒ పరిశ్రమ విస్తరించడం ఆయనలో ఆశలు రేకెత్తించింది. ఒక బహుళ జాతీయ సంస్థ (ఎంఎన్ సి) భారీ వేతనంతో ఆయనను ఒక టీమ్ లీడర్ గా నియమించింది. అప్పటి నుంచి రెండు సంవత్సరాలు గడిచాయి. ఆయన కెరీర్ ఉచ్ఛ స్థితికి చేరుకోవాలి. కాని అలా జరగలేదు.
ఒక ఫైనాన్షియల్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ అయిన 47 సంవత్సరాల అఖిలేష్ శర్మ ఫైనాన్షియల్ రంగంలో తన రెండు దశాబ్దాల కెరీర్ కు స్వస్తి చెప్పి ఒక బిపిఒ సంస్థలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనకు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. బిపిఒలో ఆయన కెరీర్ అర్ధంతరంగా ముగిసింది.
News Posted: 30 April, 2009
|