ఢిల్లీలోనే కేసీఆర్ మకాం
హైదరాబాద్: లోక్‌సభ సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేసేందుకు లోక్ సభ సమావేశాలు ఆరంభం కావడానికి చాలా రోజుల ముందే ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వ కుంట్ల చంద్రశేఖరరావు లోక్‌సభ సమావేశాలు ముగిసినా తిరిగి వచ్చే సూచనలు కనిపించటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు నాయకులు ఇలా చెబుతుంటే ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు సమీక్షా సమావేశాలు జరుపుతారో, కార్యవర్గ సమావేశం ఎప్పుడు ఏర్పాటుచేస్తారో తెలియక జిల్లా శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఆయనకు సన్నిహిత నేతలు మాత్రం కెసిఆర్ ఖాళీగా కూర్చోలేదని, జిల్లాలలో పరిస్థితులను ఎప్పటి కప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుంటున్నారనీ సమర్థిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బ తీసిన తర్వాత కెసిఆర్ తెలంగాణ భవన్‌కు రావటం దాదాపు తగ్గించేశారు. ఒకటి రెండు సార్లు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.
పటేల్ సుధాకరరెడ్డి ఎన్‌కౌంటర్ జరిగిన రోజు మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిఎన్ కౌంటర్ ను ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆపేది లేదని, తాడో పేడో తేల్చుకుంటామని ప్రకటించారు. అదే సమావేశంలో వీసాతో తెలంగాణను పాలిస్తున్న వైఎస్ వీసా రద్దు చేసే రోజు దగ్గర్లోనే ఉందని మరీ చెప్పారు. ఇక ఆ తర్వాత ఇటు భవన్ కు రావటం మానేశారు, అటు పార్టీలో సంక్షోభం మొదలైనట్టు కథనాలు ప్రారంభం కావటం, సన్నిహితుడైన దిలీప్‌కుమార్ వేరు కుంపటి పెట్ట టం లాంటి పరిణామాలు ఆయనను పూర్తి మౌనవ్రతంలో మునిగేలా చేశాయి.
ఎన్నికల్లో పార్టీకి తక్కువ సీట్లు వచ్చినందుకు తామేమీ చిన్నబుచ్చుకోవటంలేదని, వోట్ల బదలా యింపు సరిగా జరగకపోవటం, కాంగ్రెస్ వ్యతిరేక వోట్లు చీలిపోవటం వల్లనే దాని ప్రబావం మహా కూటమిపైన, దరిమిలా తమ పార్టీ పైన పడిందని కెసిఆర్ ప్రారంభంలో ఎన్నికల ఫలితాలను విశ్లేషిం చారు. పైగా కూటమికి వచ్చిన వోట్ల శాతం కన్న కాంగ్రెస్‌కు తక్కువే వచ్చిందనీ చెప్పారు. ఈ ఫలి తాలను తాము పట్టించుకోవటంలేదని, ప్రజా ఉద్య మాలను ఉధృతం చేయటం ద్వారా తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ఇలా చెప్పిన కెసిఆర్ ,ఆ దిశలో ఏ ప్రయత్నాలూ చేయకుండా ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు. ఆయన ఎందుకు వెళ్ళారో, ఢిల్లీలో ఏమి చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో పార్టీలో నలుగురు లేదా ఐదుగురికి తప్ప ఎవరికీ తెలియదు. వారు అయినా వివరణ ఇస్తారా అంటే అదీ లేదు. చిన్నతనం లేనప్పుడు యథావిధిగా పార్టీ కార్యక్రమాలను చేపట్టటానికి అభ్యంతరం, చిన్న తనం దేనికని పార్టీ శ్రేణులు వేస్తున్న ప్రశ్నలకు ఎవరినుంచీ జవాబులు లేవు.
Pages: 1 -2- News Posted: 5 June, 2009
|