'ఆకలి' తీర్చని 'విందు'
న్యూఢిల్లీ : పెన్నుల క్యాప్ లు అలాగే ఉండిపోయాయి. నోటు పుస్తకాలు తెరుచుకోకుండానే బల్లలపై యథాతథ స్థితిలో ఉండిపోయాయి. 2009 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం అనంతరం విలేకరులతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి సాగించిన తొలి ముఖాముఖికి ఇది అద్దం పడుతున్నది. ఆమె వచ్చారు, చూశారు, కాని మాట్లాడింది చాలా కొద్దిగానే.
సోనియా కేవలం మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అన్ని ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆమెకు తెలుసా అనేది వాటిలో ఒకటి. '150, 160 మధ్య సీట్లు రాగలవని మేము ఊహించాం. కాని బిజెపికి కూడా ఆ దరిదాపుల్లోనే సీట్లు వస్తున్నాయని మేము విన్నప్పుడు మేము ఆధిక్యంలో ఉన్నామని మాకు తెలుసు' అని ఆమె చెప్పారు. మరి కాంగ్రెస్ కు బిజెపి కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఎప్పుడైనా ఊహించారా అనే ప్రశ్నకు 'ఎన్నడూ లేదు' అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర శాసనసభలలోను, పార్లమెంట్ లోను మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని సూచించే బిల్లు గురించి కూడా సోనియాను ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా అనేక మంది వాదిస్తున్న నేపథ్యంలో బిల్లు అసలు ఎన్నడైనా వెలుగు చూస్తుందా? బిల్లుపై ఏకాభిప్రాయం లేనందున ఆందోళన చెందవలసి వస్తున్నదని, అయితే, 'ఇవి కుంటిసాకులు మాత్రమే' అని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఆహారం చాలా బాగుంది. సర్వీసు కూడా లోపాన్ని ఎంచలేని రీతిలో ఉన్నది. విందు వేదిక అయిన ఢిల్లీలోని అశోకా హోటల్ కన్వెన్షన్ సెంటర్ లో సంభాషణలు కూడా ఆకట్టుకునే రీతిలోసాగాయి. ప్రతి విషయం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 11 June, 2009
|