వైఎస్‌ది మళ్ళీ అదే దారి!
హైదరాబాద్: ఓడిన రాజకీయ పునరావాసం ఉంటుందని నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ నేతలకు ఈ సారి కూడా ఆశాభగం తప్పేట్లు లేదు. ఈ ఎన్నికల్లో ఓడిన వారు ముఖ్యమంత్రి వై.ఎస్. ఏదో ఒక రాజకీయ పునరావాసం కల్పిస్తారన్న ఊహల్లో కొందరు నేతలు మునిగితేలుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి ఆలోచన ఉన్నట్లు సమాచారం. 2004 ఫార్ములాను ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరోసారి పాటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి మంత్రి పదవి, లేక ఇతర కార్పొరేషన్ ఛైర్మన్‌గిరి, అలాగే ఓడిన వారికి కార్పొరేషన్ పదవులు ఇవ్వకూడదని నాడు నిర్ణయించారు. ఈ ఫార్ములాను నాడు వై.ఎస్. తూచాతప్ప కుండా పాటించారు. ఇప్పడు అదే ధోరణీని అనుసరించనున్నారని సమాచారం.
ఓడిన వారికి ఎలాంటి కార్పొరేషన్ ఛైర్మన్‌గిరి పదవులు ఇవ్వకూడదు, అలాగే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి మంత్రిపదవి ఇవ్వకూడదు, అలాగే ఎమ్మెల్సీకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వకూడదు ఇది సిఎం ఫార్ములా. ఈ ఫార్ములాను రూపొందించడానికి కారణంలేక పోలేదు. సీనియర్లను విస్మరించి తమ వారికి పదవులు కట్టబెట్టారు అన్న అపవాదును తెచ్చుకోకూడదని వై.ఎస్. ఈ ఫార్ములాను అనుసరించారు. అంతేకాకుండా ఈ విధానాన్ని గత ఐదేళ్లకాలంలో ఆచరణలో చూపారు. 2004లో తన సన్నిహితులైన బాలినేని శ్రీని వాసరెడ్డి, వట్టి వసంత్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటివారు తొలిసారిగా ఎమ్మెల్యే లుగా ఎన్నికయ్యారు. వీరిని మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా దూరం ఉంచారు. అందే సందర్భంలో వీరికి ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా నాడు ఇవ్వలేదు. కానీ 2009లో గెలిచి రెండో సారి ఎమ్మెల్యేలు అయ్యాక బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వట్టివసంత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు మంత్రివర్గంలో స్థానం కల్పిం చారు. ఇదే సూత్రాన్ని ఈ ఐదేళ్లకాలంలో పాటిం చాలని వై.ఎస్. యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఓడిన వారిలో సిఎం సన్నిహితులు కూడా ఎక్కువగానే ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|