'డీమ్డ్'కు యుజిసి కళ్ళెం!
న్యూఢిల్లీ : దేశంలో ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించే యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో మిన్నంటుతున్న ఫీజులను నియంత్రించాలని, వాటి వివాదాస్పద అడ్మిషన్ ప్రక్రియను పారదర్శకం చేయాలని యోచిస్తున్నది. దేశంలో ప్రస్తుతం ఉన్న 127 డీమ్డ్ విశ్వవిద్యాలయాలూ తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఎంతైనా ప్రయత్నిస్తుంటాయి. తమను అదుపాజ్ఞలలో పెట్టడానికి జరిగే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటిస్తుంటాయి. ప్రభుత్వాన్ని దూరంగానే ఉంచే ధ్యేయంతో అవి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినట్లు తెలుస్తున్నది. కాని వాటిని కట్టడి చేయాలనే దృఢచిత్తంతో యుజిసి ఉంది.
'అడ్మిషన్లలో పారదర్శకత ఉండడం లేదని, నిర్హేతుకంగా అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తుంటాయని డీమ్డ్ విశ్వవిద్యాలయాల గురించి చాలా వరకు ఫిర్యాదులు వస్తుంటాయి' అని యుజిసి చైర్మన్ ఎస్.కె. థొరాట్ 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు. 'ప్రభుత్వ నిబంధలనలు ఏవీ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు నడిపే విద్యా సంస్థలకు వర్తించడం లేదు' అని థొరాట్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని చట్టం ద్వారా ఏర్పాటు చేయని విద్యా సంస్థను డీమ్డ్ విశ్వవిద్యాలయంగా పేర్కొంటుంటారు. ఏదైనా విద్యా సంస్థను విశ్వవిద్యాలయంగా పిలవాలంటే అటువంటి చట్టం అవసరం. దేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో రమారమి మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
127 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా సుమారు 200 వైద్య, ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ కాలేజీలను నడుపుతున్నాయి. ప్రసిద్ధి చెందిన కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కర్నాటకలోని మణిపాల్ యూనివర్శిటీ, ముంబైలోని నార్సీ మోంజీ ఇన్ స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ స్టడీస్, భారతీయ విద్యా పీఠ్. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ కొత్త మంత్ర కపిల్ సిబల్ ఇటీవల ఆదేశించిన విధంగా సమీక్ష జరిపినప్పుడు లోటుపాట్లు బయటపడినట్లయితే ఆ డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో కొన్ని తమ హోదాను కోల్పోయే అవకాశం ఉంది.
Pages: 1 -2- News Posted: 15 June, 2009
|