తెరాసపై క్రీనీడలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ పరమైన గందరగోళం, ఓటములు తదితర పరిణామాలన్నిటికీ మరో కోణంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇది రాజకీయపరమైన చర్చ కాదు...ఆధ్యాత్మిక కోణంలో కొందరు పండితులు, వాస్తు శాస్త్ర వేత్తలు ఈ చర్చకు తెర తీశారు. బంజారా హిల్స్‌లో ఉన్న టిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ పక్కనే ఇటీవల భారీ ఎత్తున నిర్మించిన జగన్నాథ స్వామి ఆలయం ఛాయ (నీడ) నిరంతరంగా పడుతుండటమే పార్టీలో నెలకొన్న సంక్షోభానికి ప్రధాన కారణం అని పండితులు చెబుతున్నారు. ఆలయ ప్రధాన గోపురం, అనుబంధ గోపురాలపై పడే సూర్యకిర ణాల ఛాయ టిఆర్‌ఎస్ కార్యాలయంపై పడుతుంటుందని, అందుకే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని ఒక పండితుడు తెలిపారు.
జగన్నాథ స్వామి సాక్షాత్తూ విష్ణు స్వరూపుడు కావటం, ఆ ఆలయం నీడ ఇంటిపైన కానీ, కా ర్యాలయం పైన కానీ పడితే అరిష్టాలు వాటిల్లు తాయని శాస్త్రం చెబుతున్నట్టు ఒక పండితుడు తెలిపారు. అందులోనూ ఆలయ ప్రాంగణంలో రుద్రాంశ సంభూతుడైన హను మంతుడు, నవ గ్రహాల ఆలయాలు సైతం ఉన్నా యి. విష్ణ్వంశ, రుద్రాంశ సంభూతులైన జగన్నా థ, ఆంజనేయ ఆలయ ఛాయలు, వాటికి తోడు గా అదృష్టా లను రక్షించటంతో పాటు తలకిందు లు చేసే అమోఘ శక్తి ఉన్న ఆదిత్యాది నవగ్రహ విగ్ర హాలు ఒకే చోట ఉండటంతో ఆ ఆలయ ఛాయ పక్కనే ఉన్న తెలంగాణ భవన్‌పై పడుతు న్నందు న అనేక దుష్పరిణామాలు సంభవిస్తు న్నాయని ఆ పండితుడు విశ్లేషించారు.
Pages: 1 -2- News Posted: 16 June, 2009
|