'తప్పు' ఒప్పుకున్న షైనీ
ముంబై : తనపై అత్యాచారం ఆరోపణ చేసిన గృహసేవిక 'అంగీకారంతోనే సెక్స్' జరిపి తాను 'తప్పు' చేశానని బాలీవుడ్ నటుడు షైనీ అహుజా అంగీకరించినట్లు ముంబై పోలీసులు మంగళవారం తెలియజేశారు. అయితే, నటుడు 'దౌర్జన్యంగా' ఈ పనికి ఒడిగట్టినట్లు, దీనితో తాను మానసిక వ్యథకు గురైనట్లు ఆ టీనేజి యువతి చెప్పిందని కూడా పోలీసులు తెలిపారు.
ఆ యువతిపై లైంగికపరంగా దౌర్జన్యం జరిగిందని వైద్య పరీక్షలలో తేలినట్లు పేర్కొంటూ నాగపడా పోలీస్ ఆసుపత్రి నుంచి తమకు ఒక నివేదిక అందిందని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. అయితే, యువతి మర్మావయవాల వద్ద గాయాలు ఉండడం బట్టి బలవంతంగా సెక్స్ కు జరిపినట్లు విదితమవుతున్నదని, కాని ఆమె శరీరంపై వేరే ఎక్కడా గాయాల గుర్తులు లేవని వారు తెలిపారు.
బాధితురాలు తనను ప్రతిఘటిస్తున్నప్పుడు అహుజా ఆమెను కొట్టాడనే ఆరోపణ వచ్చిందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. 'ఆమె మాకు ఇచ్చిన వాఙ్మూలం ప్రకారం, అహుజా ఎంత పట్టుదలతో ఉన్నాడంతే ఆమెను కొట్టాడు కూడా. అతను ఆమె చేతులను అదిమిపెట్టి అత్యాచారం జరిపాడు. అత్యాచారం అనంతరం ఆమెకు మర్మావయవాల వద్ద బాగా నొప్పి కలిగింది' అని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు.
తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆ సంఘటన అనంతరం దాదాపు అర గంట సేపు తాను బెడ్ పై నుంచి లేవలేకపోయానని బాధితురాలు పోలీసులతో చెప్పిందని కూడా ఆ అధికారి తెలిపారు. ఆ యువతి 'దౌర్జన్యకరంగా జరిగిన అత్యాచారం' గురించి వివరించినట్లు ఆయన తెలిపారు. ఆ యువతి మొదట పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు 'ఒక అత్యాచార బాధితురాలి వలె ఆమె బాగా కుంగిపోయి కనిపించింది' అని ఆ అధికారి తెలిపారు.
బాలీవుడ్ నటుడు షైనీ అహుజా, తాను ఇద్దరమే ఆదివారం ఇంటిలో ఉన్నసమయంలో తనపై అతను అత్యాచారం జరిపాడని ఆమె ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అహుజాను గురువారం వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసిన సంగతీ తెలిసిందే.
Pages: 1 -2- News Posted: 17 June, 2009
|