మల్లోజులే లాల్‌గఢ్ కిషన్‌జీ!
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో జరుగుతున్న మరో నక్సల్బరీ పోరుకు నాయకత్వం వహిస్తోంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటీశ్వర్‌రావు ఆలియాస్ ప్రహ్లాద్ ఆలియాస్ కిషన్‌జీ. పశ్చిమబెంగాల్ మిడ్నపూర్ జిల్లాలో సిపిఎంకు కంచుకోటగా పరిగణించే లాల్ గఢ్ ను మావోయిస్టులు విముక్తి ప్రాంతంగా ప్రకటించి, అక్కడి ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో మల్లోజు కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు నిర్థారించాయి.
కోటీశ్వరరావు 1952లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుం బంలో మధురమ్మ-వెంకటయ్య దంపతులకు జన్మించిన ఆయన ఈయన 1975లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. బిఎస్సీ చదివి, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బి చేస్తూ విప్లవ భావాలకు ఆకర్షితుడెై రెైతు కూలీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1976 ఎమెర్జెన్సీలో వరవరరావు, కెజి సత్యమూర్తితో కలిసి పాల్గొన్నారు.
1978లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పూర్తిస్థాయి కార్యకర్తగా నక్సలెట్ల ఉద్యమంలో భాగస్వాముడయ్యాడు. 1979లో ఇదే జిల్లాలోని సంకెనపల్లిలో ఆరెస్టు అయ్యాడు. రైతు కూలీ సంఘ పోరాటంలో పాల్గొం టూ మరోసారి ధర్మారం మండలం రచ్చపల్లిలో పోలీసులకు చిక్కాడు. ఎలాగోలా బయటకు వచ్చి ఆ తర్వాత ఆదిలా బాద్ జిల్లా తపాలాపూర్‌లో జరిగిన ఓ కుట్ర కేసులో ప్రధా న నిందితుడిగా నిలిచాడు. ఈ కుట్ర కేసు మావోయిస్టు చరిత్రలో ఇప్పటికీ చెప్పుకోదగింది.
Pages: 1 -2- News Posted: 19 June, 2009
|