ఒకే జైలులో షైనీ, సాలెం
ముంబై : కళ, వాస్తవ జీవితం ఒకే చోట మిళితం కాబోతున్నాయి. మాఫియా డాన్ ఆబూ సాలెం జీవిత కథ ఆధారంగా 2006లో నిర్మించిన 'గ్యాంగ్ స్టర్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన షైనీ అహుజా జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ముంబై ఆర్థర్ రోడ్ జైలులో 14 రోజుల పాటు గడపబోతున్నాడు. తనపై కేసుల విచారణ కోసం నిరీక్షిస్తూ సాలెం అదే జైలులో ఉంటున్నాడు. ఒక స్థానిక కోర్టు గురువారం అహుజాను జూలై 2 వరకు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. తన ఇంటిలో పని చేసే యువతిపై అత్యాచారం చేశాడనే ఆరోపణను 35 ఏళ్ళ బాలీవుడ్ నటుడు షైనీ అహుజా ఎదుర్కొంటున్న విషయం విదితమే.
ఇప్పుడు అహుజా వలె సాలెం 2005లో పోర్చుగల్ తనను ఇండియాకు అప్పగించినప్పటి నుంచి ముంబైలోని ఈ ప్రధాన జైలులో నిర్బంధంలో ఉన్నాడు.1993 వరుస పేలుళ్ళలో తనకు ప్రమేయం ఉందనే కేసులోను, రెండు హత్య కేసులలో కోర్టు తీర్పుల కోసం సాలెం నిరీక్షిస్తున్నాడు. అతనిని ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో పదవ నంబర్ బ్యారక్ లో నిర్బంధించారు. 1993 పేలుళ్ళ కేసులోని మరి ఇద్దరు నిందితులు, అనేక మంది ఇతర ఖైదీలు కూడా అదే బ్యారక్ లో ఉన్నారు.
షైనీ అహుజా చలనచిత్ర జీవితం గురించి సాలెంకు బాగా తెలిసి ఉండవచ్చు. 2006లో 'గ్యాంగ్ స్టర్' విడుదల కావలసి ఉన్న సమయంలో సాలెం పరారీలో ఉండగా అతని తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఆ చిత్రానికి సాలెం జీవిత సంఘటనలు ఆధారమని వారు కోర్టుకు ఫిర్యాదు చేశారు. చిత్రం విడుదలను నిలుపుదల చేయించాలని వారు కోర్టును అభ్యర్థించారు. 2006 చిత్రంలో ప్రేమలో కూరుకుపోయిన, చట్టాన్ని అమలుజరిపే సంస్థలకు పట్టుబడకుండా తప్పించుకుంటూ విదేశాలకు పరారైన ఒక గూండా పాత్రను అహుజా పోషించాడు.
Pages: 1 -2- News Posted: 19 June, 2009
|