రాజీనామా వ్యూహమేనా?
హైదరాబాద్: వ్యూహరచయిత, ఎత్తుగడలో నిష్ణాతుడు, మాటల మరాఠాగా పేరున్న టిఆర్‌ఎస్ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేల్చిన రాజీనామా బాంబు గతానుభవాల దృష్ట్యా వ్యూహాత్మకంగానే కనిపి స్తోంది. తెలంగాణ కోసం ఎంతో కష్టపడి, ఉద్యమం చేస్తున్న తనపై, తనకుటుంబసభ్యులపై సొంతపార్టీ నేతలతో పాటు, కాంగ్రెస్ చేస్తున్న దాడులతో కలత చెందినట్లు ప్రకటించి రాజీ నామా చేసిన కెసిఆర్.. తనపై శరపరంపరగా వస్తున్న ఆరోపణల నుంచి సానుభూతి సంపాదిం చుకునే ప్రయత్నం చేశారు.
సిరిసిల్లలో తిరుగుబాటు అభ్యర్ధి మహేందర్‌రెడ్డితో మొదలైన అసమ్మతి పర్వం, తన కంటి రెప్పలా ఉండే ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తిరుగుబాటుతో పరాకాష్టకు చేరడంతో ఎడాపెడా కొనసాగిన రాజీనామాలు,ధిక్కారపర్వాలతో కెసి ఆర్ కష్టాల్లో పడ్డారు. మరోవైపు.. ఇన్నాళ్లూ ప్రత్య క్షంగా, పరోక్షంగా మద్దతునిచ్చిన తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, కళాకారులు కూడా తనపై ధ్వజమెత్త డంతో కెసిఆర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. ఇంకోవైపు.. కుటుంబపాలనం టూ సొంత పార్టీ వారే పరోక్షంగా వ్యాఖ్యానించడం కూడా ఆయనను ఇరుకునపడింది. ఎన్నికల ముందువరకూ తాను ఎన్నిసార్లు అవమానించినా భరించి, పార్టీకి మద్దతునిచ్చిన మీడియా కూడా ఒక్కసారిగా అడ్డం తిరగడంతో ఆయన ఖంగు తినక తప్పలేదు.
Pages: 1 -2- News Posted: 19 June, 2009
|