గగనం నుంచి టెర్రర్ దాడి?
న్యూఢిల్లీ : ఉగ్రవాదులు ఈ సారి గగనతలంలో నుంచి దాడులు జరపవచ్చునని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ వద్ద గల వేగుల సమాచారం సూచిస్తున్నది. పాకిస్తాన్ కేంద్రంగా గల లష్కర్-ఎ-తయ్యెబా (ఎల్ఇటి)తో సహా ఉగ్రవాద సంస్థల దాడులకు లక్ష్యాలలో కీలకమైన రక్షణ శాఖ సంస్థలు, ఏకైక విమానవాహక నౌక ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులను కూడా అవి లక్ష్యం చేసుకోవచ్చు. ముంబైలో వివిధ భవనాలపై దాడులు సాగించడానికి లష్కర్ 2008 నవంబర్ లో సముద్ర మార్గాన్ని ఉపయోగించుకున్నది. ఆ దాడులలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇంటలిజెన్స్ బ్యూరో ఇటీవల టాప్ చేసిన ఉగ్రవాద సంస్థల సమాచారంలో ఉగ్రవాద నిరోధక విభాగం అధికారుల దృష్టిని ఆకర్షించిన ఒక అంశమేమిటంటే 'లష్కర్ కమ్యూనికేషన్ల విభాగం అధిపతి జరార్ షాతో సహా కీలక నాయకులు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిలో హెలికాప్టర్ చార్టర్ సర్వీసుల గురించి అధ్యయనం చేస్తున్నారు' అనేది.
'ముఖ్యమైన కేంద్రాలపై సంచలనాత్మక దాడులు ప్రారంభించడానికి ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను ఉపయోగించాలని ఎల్ఇటి కమాండర్లు యోచిస్తున్నారు' అనే ఒక సమాచారం సూచించిందని హోమ్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలియజేశారు. అయితే, మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు అధికారం లేదు.
Pages: 1 -2- News Posted: 23 June, 2009
|