`టీ' పై పెదవి విప్పొద్దు
హైదరాబాద్ : పరాజయాన్ని తెచ్చిపెట్టిన వివాదాంశాలలో ప్రత్యేక తెలంగాణ వాదం తెలుగుదేశం పార్టీని ఇంకా అతలాకుతలం చేస్తూనే ఉంది. పార్టీలో నాయకులు రెండు పక్షాలుగా విడిపోయి తెలంగాణకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. తలసాని దుమారం ఇంకా కలకలం రేపుతూనే ఉంది. దీన్ని సద్దుమణిగించడానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశంపై నేతలెవరూ మాట్లాడవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణ అంశంలో కొందరు నాయకులు బాబుపై ఒత్తిడి చేస్తున్నారంటూ ఆంధ్ర-రాయలసీమ నేతలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు, తెలంగాణవాదం వల్లే పార్టీ ఓడిపోయిందిని, ఇప్పటికయినా సమైక్యవాదం నినాదంతో వెళ్లకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ మరింత దెబ్బతింటుందన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యలతో మళ్ళీ ఆ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో... తెలంగాణ గురించి నాయకులెవరూ మీడియా వద్ద మాట్లాడవద్దని బాబు శుక్రవారం నాటి వర్క్ షాపులో హెచ్చరించినట్లు తెలిసింది. దీనితో తలసాని చేస్తున్న వాదన ఫలించినట్టయింది.
Pages: 1 -2- News Posted: 27 June, 2009
|