రాజీకి నై - పేచీకే సై
హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసినవారిలో కొందరు తిరిగి కెసిఆర్ నాయకత్వంలో కలిసి పని చేస్తామని ప్రకటించి పార్టీలో చేరిపోగా, మిగిలిన నాయకులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వీరిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకురావాలని శనివారం రాత్రి పార్టీ ముఖ్యులు కొందరు చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. పార్టీ అధినేత కెసిఆర్ కుమారుడు తారకరామారావుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని వారు ప్రధానంగా డిమాండ్ పెట్టడం వల్లనే చర్చలు విఫలం అయ్యానని ఆ పార్టీ వర్గాల సమాచారం. వీరి డిమాండ్ ను టిఆర్ఎస్ అధినాయకత్వం ఎట్టిపరిస్థితిలో అంగీకరించదని తేల్చిచెప్పడం వల్లనే చర్చలు ఫలించలేదని ఆ పార్టీ ముఖ్యడొకరు తెలిపారు.
పార్టీ నుంచి తిరుగుబాటు బావుటా ఎగరేసిన వారిలో మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్, డి రవీంద్రనాయక్, హెచ్ రహ్మాన్, ఆర్ ఉమాదేవి తిరిగి కెసిఆర్ సమక్షంలో రాజీపడ్డట్టు ప్రకటించారు. వీరితోపాటు పార్టీపై తిరుగుబాటు చేసిన వారిలో ఇంకా టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు భీరవల్లి సోమిరెడ్డి, కెసిఆర్ తనయుడు కెటిఆర్ పై సిరిసిల్లలో రెబల్ గా పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరే కాకుండా రసమయి బాల్ కిషన్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ నాయకులు చేసిన బుజ్జగింపులకు సమ్మతించి పార్టీలో తిరిగి చేరేందుకు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Pages: 1 -2- News Posted: 29 June, 2009
|