ఓట్ల లోటుపై వైఎస్ మండిపాటు
హైదరాబాద్ : అధికారం చేపట్టినా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ ని కలవరపరుస్తున్నాయి. ఇప్పటికీ ఫలితాల తీరుతెన్నులు అంతుబట్టని వైఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా విశ్లేషిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారి ఓట్లనమోదు శాతాన్ని సైతం ఆయన స్వయంగా పరిశీలుస్తున్నారు. తన అంచనాలను తారుమారు చేస్తూ వచ్చిన ఫలితాల అంతు చూడ్డానికే ఆయన నిర్ణయించుకున్నారు. దానిలోభాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక సంస్థలపై దృష్టిని కేంద్రీకరించారు. ఆయన అనుమానించినట్లే ఎక్కడైతే కాంగ్రెస్ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్నారో అక్కడే పార్టీ ఓట్లకు భారీగా గండిపడినట్లు తేటతెల్లమైంది.
కాంగ్రెస్ కు నెగెటివ్ ఓటింగ్ రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ తన సన్నిహితులతో భేటి అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న జడ్పిటిసిలు, వార్డులు, డివిజన్లలో ఓటింగ్ సరళిని ముఖ్యమంత్రి సమీక్షించారు. పార్టీ ఓటమికి, తక్కువ ఓట్లు రావడానికి వారినే బాధ్యులుగా చేయాలని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. పార్టీకి చెందిన 10 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల ప్రాదేశిక నియోజకవర్గాలలో తక్కువ ఓట్లు వచ్చాయి. 93 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు కాంగ్రెస్ అధీనంలో ఉండగా, వాటిలో 37 పట్టణాల్లో చైర్మన్ వార్డుల్లో కాంగ్రెస్ కు నెగెటివ్ ఓట్లు వచ్చాయి. వాటిలోని 24 పట్టణాల్లోని చైర్మన్ వార్డుల్లో పిఆర్పి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచింది. 10 పట్టణాల్లోని చైర్మన్ల వార్డుల్లో కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైంది.
Pages: 1 -2- News Posted: 2 July, 2009
|