పరువు తీస్తున్న కొట్లాటలు
హైదరాబాద్ : కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే తయారయింది. అత్తెసరు మార్కులతోనే అధికారం దక్కడానికి చాలా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకుల ధిక్కారమే కారణమని విశ్లేషించిన అధినాయకత్వం జిల్లాల వారీ సమీక్షలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేసిన వారి భరతం పట్టడానికి ఇదే మంచి మార్గమని పీసీసీ అధ్యక్షుడు డిఎస్, ముఖ్యమంత్రి వైఎస్ జలిమిగా నిర్ణయించారు. వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పడం మాటేమోగాని ఈ సమీక్షా సమావేశాల్లో కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి తలపడి పార్టీ అధినేత డిఎస్ కు తలనొప్పులు తెప్పించడమే కాకుండా తలవంపులు కలిగిస్తున్నారు. ఈ పరిణామాలు సీనియర్ నాయకుల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇంటిని చక్కదిద్దుకుందామనుకుంటే, ఇంటి పరువే రచ్చకెక్కుతోందని గగ్గోలు పెడుతున్నారు.
Pages: 1 -2- News Posted: 9 July, 2009
|