కాంగ్రెస్ లో కొత్త కలవరం
హైదరాబాద్ : ఆయారాంలతో రాష్ట్ర కాంగ్రెస్ లో తాజాగా కలవరం మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఎన్నికలకు ముందు వేటు వేసిన పార్టీ నేతలను తిరిగి చేర్చుకునే విషయం, అలాంటి ఫిర్యాదులతోనే ప్రస్తుతం పీసీసీ స్క్రీనింగ్, విచారణ కమిటీ ముందు విచారణ ఎదుర్కొంటున్న వారి వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా తయారైంది. ఇలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే తాము సహించేది లేదని, పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఒకవైపు పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. పార్టీ ఆదేశాలను ఖాతరు చేయనప్పటికీ, ఎన్నికల్లో గెలిచి మళ్ళీ పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్న వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీ బలపడుతుందంటూ వైఎస్ సన్నిహిత వర్గాలు మరో వైపు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొన్నట్లు వినిపిస్తోంది.
పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారిపై వేటు వేయకుంటే పార్టీలో క్రమశిక్షణ సన్నగిల్లడంతో పాటు ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేటు వేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎక్కడ నష్టం కలుగుతుందోననే భయం మరోవైపు పార్టీని వెంటాడుతున్నది. దీంతో ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్నట్లు తయారైందంటున్వద్. సమస్య వారం రోజులుగా గాంధీభవన్ వద్ద కనిపిస్తుండడం నాయకత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలపై పార్టీ అభ్యర్థులు, పార్టీనేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు 600 మంది వరకు నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పీసీసీ స్ర్కీనింగ్ కమిటీ ముందు విచారణ ఎదుర్కొంటున్నారు.
Pages: 1 -2- News Posted: 23 July, 2009
|