ఎఐసిటియూకి సిబల్ కత్తెర
న్యూఢిల్లీ : అవినీతి ఊబిలో కూరుకుపోయిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటియూ) అధికారాలకు కేంద్ర విద్య, మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ కత్తెర వేస్తున్నారు. సాంకేతిక కళాశాలలో విద్యార్ధు సంఖ్య పెంచుకోవాలంటే యాజమాన్యం ఎఐసిటియూ అనుమతిని తప్పక తీసుకోవాలి. ఆ కళాశాలను ఎఐసిటియూ బృందం తనిఖీ చేసి ఆ తరువాతే అనుమతిని మంజూరు చేసేది. అసలు భాగోతం అంతా ఇక్కడే నడిచేది. తనిఖీని ఆలస్యం చేసి చివరకు యాజమాన్యాల దగ్గర ముడుపులు దండుకుని అనుమతులు ఇచ్చేవారు. సరిగ్గా ఈ అధికారానికే సిబల్ అంట కత్తెర వేశారు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు అవినీతి చెదలతో అసలే పరువు పొగొట్టుకున్న ఎఐసిటియూ అధికారులకు సిబల్ నిర్ణయం ప్రతిష్టను మరీ దిగజార్చినట్లు మారింది.
ఇక నుంచి సాంకేతిక విద్యాసంస్థల యజమానులు ఎఐసిటియూ అనుమతుల కోసం పడిగాపులు పడక్కర్లేదు. తాము ఎప్పుడు విద్యార్దుల సంఖ్యను పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. కాని పెంచుకున్న తరువాత జరిగే తనిఖీల్లో ప్రమాణాలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎంత సంఖ్యను పెంచుకోవాలను కుంటున్నమో తెలియచేస్తూ ఎఐసిటియూ కి ఒక దరఖాస్తు పెట్టుకుంటే చాలు. ఆ తరువాత ఎప్పుడో మండలి బృందం తనిఖీకి వస్తుంది. అప్పుడు అనుమతి లభిస్తే పెంచుకున్న సంఖ్యను కొనసాగించుకోవచ్చు. లేకపోతే పాత సంఖ్యకు కుదించుకోవాల్సి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 25 July, 2009
|