యాదవ్ పై ఎంపీల ప్రేమ న్యూఢిల్లీ : అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆ అధికారికి అద్భుతమైన అండ దొరికింది. అదేం ఆషామాషీ మద్దతు కాదు... సాక్షాత్తూ అత్యున్నత చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మన నేతలే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దేశాన్ని నివ్వెరపరచిన, విద్యావేత్తలను తలదించుకునేలా చేసిన జాతీయ సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఈ) అవినీతి భాగోతంలో పాత్రధారులని సిబిఐ పేర్కొంటున్నవారిపై మన నాయకుల ప్రేమ పొర్లిపోతోంది. మండలి చైర్మన్ రామ్ అవతార్ యాదవ్ కూడా తక్కువ తినలేదని సిబిఐ కేసు నమోదు చేసింది. దాంతో ఓ పది రోజుల క్రితం కేంద్ర మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యాదవ్ ను పదవి నుంచి తప్పించి, వైస్ చైర్మన్ కు బాధ్యతలు అప్పగించింది.
దేశంలో ఏం జరిగినా కులం కార్డు తగిలించడంలో నేర్పరులైన మన రాష్ట్రం ఎంపీలే యాదవ్ కు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలుపెడుతున్నారు. యాదవ్ వెనుకబడిన వర్గానికి చెందిన వారు కాబట్టే అవినీతి ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తప్పించారని, యాదవ్ పై సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని కోరుతూ ఏకంగా ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా రాసేశారు. యాదవ్ కు మద్దతు పలికే విషయంలో ఈ ఎంపీలందరూ వేరే వేరే పార్టీల వారైనా, రాష్ట్రాల వారైనా ఏకతాటి పైకి వచ్చేశారు. యాదవ్ అవినీతిపరుడని కేసు నమోదు చేసిన సిబిఐ ఇంకా దర్యాప్తు పూర్తి చేయకముందే, కోర్టులో యాదవ్ నేరం నిరూపణ కాకముందే మన పార్లమెంటు సభ్యులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేశారు.
Pages: 1 -2- News Posted: 11 August, 2009
|