ఓ `మగధీరు'ని విషాదం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/TP.gif' align='left' alt=''>
హైదరాబాద్ : ఆ కన్నతల్లి కన్నులు ఎడారులైపోయాయి. కన్నతండ్రి గుండె చెరువైపోయింది. గంపెడాశలతో పెంచిన కొడుకు చేతికి అందొచ్చేవేళ... కర్కశంగా కాటేసిన కాలనాగు ఆ కుటుంబంపై విషాద విషాలను కక్కింది. మగధీర సినిమాకు వెళ్ళి విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రవీణ్ కుమార్ కథే ఇది. అనునిత్యం ఆకలి కరకర నమిలేసే పేదరికం నుంచి పుట్టిన విద్యా కుసుమం అన్యాయంగా రాలిపోయింది. పట్టుదలతో దరిద్రాన్ని జయిస్తున్న యువకుడిని సినిమా ఆశ నిర్దయగా బలి తీసుకుంది. ప్రవీణ్ కుమార్ జీవితం విజయం అంచున ఓడిపోయిన వీరుని దయనీయ ఉదంతం. ఏడాదికి ఏడు లక్షల రూపాయల జీతం అందుకునే సువర్ణ అవకాశం నేలలో కలిసిపోయిన వేళ... చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు చితికి చేరిన వేళ... కోటీశ్వరులైన సినిమా నిర్మాత, థియేటర్ యజమాని, ప్రభుత్వం అరకొర నష్టపరిహారం ప్రకటించి కనికరం మాటున ప్రదర్శించిన కాఠిన్యాన్ని చూసిన వేళ... ఆ కన్నతల్లి కన్నులు ఎడారులైపోయాయి. కన్నతండ్రి గుండె చెరువైపోయింది.
వరంగల్ జిల్లా కాజీపేట భవానీ ధియేటర్లో మగధీర సినిమా చూడటానికి వెళ్ళి విద్యుదాఘాతంతో చనిపోయిన ఇద్దరు యువకుల్లో ప్రవీణ్ కుమార్ ఒకడు. ఎంసిఎ చివరి సెమిస్టర్ చదువుతున్న ప్రవీణ్ చిన్నతనం నుంచి చదువులో సరస్వతి పుత్రుడే. ఎప్పుడూ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడవుతున్న ప్రవీణ్ ను చదివించడానికి అతని తల్లితండ్రులు పేదరికాన్నే సవాలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ అనే గ్రామానికి చెందిన వెంకటేశం, మంజుల దంపతులకు ఇద్దరూ కుమారులే. వీరిలో పెద్దవాడే ప్రవీణ్. అన్నదమ్ములు ఇద్దరూ చదువులో రాణించడంతో ఈ కుటుంబం వరంగల్ కు మకాం మార్చింది. తండ్రి చేనేత కార్మికుడు. ఇక్కడ పని దొరక్క భార్యను, పిల్లలను ఇక్కడ వదిలేసి ఆయన సూరత్ బట్టల మిల్లులో కూలీగా చేరాడు. అతను అక్కడ సంపాదించిన దానిలో ప్రతీనెలా రెండుమూడు వేలు ఇక్కడకు పంపేవాడు. తల్లి మంజుల చిన్నగదిలో అద్దెకు ఉంటూ కుట్టు మిషన్ పై చుట్టుపక్కల వారికి బట్టలు కుట్టిపెడుతూ ఇద్దరు కొడుకులనూ చదివించుకుంటోంది. ప్రవీణ్ ఎంసిఎ చదవుతుంటే అతని తమ్ముడు బి ఫార్మసీ చదువుతున్నాడు.
Pages: 1 -2- News Posted: 13 August, 2009
|