రాష్ట్రంలో దేవుళ్ళ గో(లీ)ల రాష్ట్రంలోని రాజకీయాల్లో దేవుళ్ళ 'గోల' ఎక్కువైంది. ఇటీవల కాలంలో దేవుల్ళ ప్రస్తావన లేకుండా ఏనేత కూడా రాజకీయం చేయడం లేదు. రాజకీయ నేతలకు దేవుళ్ళ పట్ల పూనకం పెరగడమే కారణం. రాష్ట్రంలో కరవు కాటకాల్ని అర్థం చేసుకొని, తక్షణం స్పందించి సాయం చేసే సద్భుద్దిని దేవుడు ప్రసాదించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోరారు. కరువుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎదురుగా గురువారం చేసిన ధర్నా ఈ మేరకు దైవానికి విజ్ఞప్తిచేశారు.
మరోవైపు శాసనసభ ప్రాంగణంలో తన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ విలేఖరులతో మాట్లాడుతూ 'దేవుడిని ప్రార్థించడం మినహా చంద్రబాబు వైఖరిని మార్చే విషయంలో ఏమీ చేయలేం' అని వ్యాఖ్యానించారు. కరవుపై విమర్శించడం మినహా నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదన్నమంత్రి, ధర్మాన్న ప్రసాదరావు ఎదురుప్రశ్నలకు ప్రతిపక్షాల దగ్గర సమాధానం లేదన్నారు. వైఎస్ కు అనుచరుడైన మంత్రి దానం నగేందర్ కుడా 'దేవుడా! చంద్రబాబుకు సద్భుద్ధిని ప్రసాదించు. శాసనసభ సజావుగా జరిగేట్టు చూడు' అని మొక్కుకున్నానని చెప్పారు. ఈ మేరకు గురువారం సీఎం చాంబర్ బయట ప్రసాదాన్ని పంచుతూ హడావిడి చేశారు.
Pages: 1 -2- News Posted: 14 August, 2009
|