నకిలీ నోట్లతో టెర్రర్ హైదరాబాద్ : శత్రువుని గెలవాలంటే యుద్ధం చేయడం పాత పద్దతి. శత్రుదేశంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం ఆధునిక యుద్ధ రీతి... ఉగ్రవాదులు ఎంచుకున్న మార్గం. ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో రూ.500, రూ.1000 నకిలీ నోట్లను ఉగ్రవాదులు కుప్పలు తెప్పలుగా చలామణిలోకి తెస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సిబిఐ ఇటీవల హెచ్చరించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు, అక్రమాలకి నెలవుగా మారిన ఆంధ్రదేశంలో నకిలీ నోట్ల విషయంలో పోలీసులు పెద్దగా పురోగతి సాధించిన పరిస్థితులు లేవు. రోజువారీ శాంతి భద్రతలు - ఇతరనేరాల కేసులను పరిశీలించడంలోనే కాలహరణం జరుగుతోంది. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐతో సంబంధం ఉన్న కేసులను 8 ఏళ్ళలో పోలీసు అధికారులు కనుగొన్న పది కేసుల్లో పదింటిని కొనుగొని 25 మందిని అరెస్ట్ చేశారు. రూ.మూడుకోట్ల విలువైన నకిలీ కెరన్సీని స్వాధీనం చేసుకున్నారు.
2006 నుంచి ఇప్పటి వరకు నకిలీ నోట్ల కేసులో ఒక్కరిని మాత్రమే దోషిగా నిరూపించగలిగారు. పోలీసుల అభిప్రాయం ప్రకారం నకిలీ నోట్ల వరద దేశంలోకి బంగ్లాదేశ్, పాకిస్థాన్ ల నుంచి వస్తోంది. ఉగ్రవాదుల గ్రూపులతో సంబంధాలను పోలీసులు కనుగొనకపోయినా, హవాలామార్గంలో 'నకిలీ పర్వం' కొనసాగుతోందని మాత్రం గుర్తించారు. కొన్ని కేసుల్లో పశ్చిమబెంగాల్, గుజరాత్ ల వరకు పరిశోధన విస్తరించింది. మరొక కేసులో ముగ్గురు పాకిస్థానులు ఉన్నట్టు గుర్తించారు. వీరితోపాటు ముంబాయికి చెందిన ఆఫ్తాబ్ భక్త్, హైదరాబాద్ లోని బర్కాస్ కు చెందిన బాబు గైఠాన్ లను పట్టుకునేందుకు 'ఇంటర్ పోల్' సాయాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కోరారు. వీరిద్దరు దుబాయిలో ఉంటున్నట్టు సమాచారం.
Pages: 1 -2- News Posted: 19 August, 2009
|