ఇది పేదల భారతం
న్యూఢిల్లీ : భారతదేశం పేదలున్న దేశం. జనాభాలో 38 శాతం దరిద్రంలో మగ్గుతున్నారు. ఇదేదో శత్రుదేశాల కుట్రపూరితమైన ప్రకటన కాదు. దేశంలో పేదరికాన్ని కొలవడానకి ప్రభుత్వం నియమించిన కమిటీ నిగ్గుదేల్చిన నిజం. ప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా చెబుతున్న 28.5 శాతం పేదరిక లెక్కల కన్నా పదిశాతం అధికంగానే దారిద్ర్యరేఖకు దిగువున బతుకుతున్నారని కమిటీ అంచన వేసి చెప్పిన వాస్తవం.
భారతదేశంలో పౌరుని బతుకు స్ధాయిని కొలవడానకి ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, పౌష్టికాహరం, ఆదాయం అన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సూచించింది. 2004-05 లో ఈ సంస్ధ సూచన చేసే సరికి భారత జనభా నూటపది కోట్లుగా ఉంది. దేశంలో దారిద్ర్యాన్ని అంచనా వేయడానికి కొత్త పద్దతిగా దీనిని పరిగణించారు. ఎందుకంటే 1972 నుంచీ కూడా దేశంలో పేదరికాన్ని కొలవడానికి గ్రామీణ పౌరునికి 2,400 కేలరీల ఆహారాన్ని, పట్టణ పౌరునికి 2,100 కేలరీల ఆహారాన్ని కొనగల ఆర్ధిక సామర్ధ్యాన్ని సూచికగా పెట్టుకున్నారు. ఈ విధానం సరైంది కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Pages: 1 -2- News Posted: 20 August, 2009
|