పాక్ వెళ్ళనున్న జశ్వంత్ న్యూఢిల్లీ : మహమ్మద్ అలీ జిన్నాపై తాను రాసిన గ్రంథంపై ఉభయ దేశాలలోను ఆసక్తి నెలకొనడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) బహిష్కృత నాయకుడు జశ్వంత్ సింగ్ తన గ్రంథం ప్రచారం నిమిత్తం పాకిస్తాన్ కు వెళ్ళనున్నారు. ఆయన ఇస్లామాబాద్, కరాచి సందర్శించబోతున్నారు. బిజెపి నుంచి బహిష్కృతుడైన రోజు నుంచి ఆయన గ్రంథం 'జిన్నా - ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్' ఎక్కువగా అమ్ముడుపోతున్నది.
ఆసక్తిగల పాఠకులతో ముఖాముఖి కోసం, తన గ్రంథంలో ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం కోసం జశ్వంత్ సింగ్ శుక్రవారం ఇస్లామాబాద్ లో ఒక ప్రముఖ పుస్తకాల షాపును సందర్శించవలసి ఉంది. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి భద్రతపరమైన అనుమతులు ఇంకా రావలసి ఉన్నందున ఆయన అక్కడికి వెళ్ళడం ఆలస్యం కావచ్చు. 'మా ప్రాంతంలో ఈ గ్రంథానికి చెప్పుకోదగిన స్పందన లభిస్తున్నది. పుస్తకంలో ఆటోగ్రాఫ్ ల కోసం ఆయనకు ఆహ్వానించాం. శుక్రవారం ఈ కార్యక్రమం జరగవలసి ఉంది. కాని ఆయనకు భద్రతపరమైన అనుమతులు ఇంకా రావలసి ఉంది' అని ఇస్లామాబాద్లో మిస్టర్ బుక్స్ దుకాణం యజమాని, జశ్వంత్ కు ఆతిథ్యం ఇస్తున్న మహమ్మద్ యూసుఫ్ 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' పత్రిక విలేఖరితో చెప్పారు.
Pages: 1 -2- News Posted: 26 August, 2009
|