శ్రీమతుల వల్లే విభేదాలు!
న్యూఢిల్లీ : భారతదేశపు కుబేరుల్లో కెల్లా ముఖ్యులైన ధీరూభాయ్ అంబానీ వారసులు ముఖేష్ - అనిల్ అంబానీల మధ్య విభేదాలకు కారణమేమిటో తెలుసా! వారి భార్యల మధ్య తోడికోడళ్ళ పోరేనట! భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపగలిగిన స్థాయిలో వ్యాపార సంస్థలను నడుపుతున్న సోదరులు కూడా భార్యల 'ఇగో'ల చట్రంలో ఇరుక్కున్నారని ఎవరికైనా అనిపించక మానదు. అంబానీ కుటుంబానికి సన్నిహితుడొకరు - ఇద్దరి మధ్య గొడవకు కారణాన్ని చెప్పడంతో నమ్మక తప్పడం లేదు. కుటుంబ పెద్ద ధీరూభాయ్ అంబానీ మరణానంతరం తోడికోడళ్ళు - నీతా, టీనా మధ్య ఎవరు 'రిలయెన్స్' మహారాణి కావాలన్నది ప్రశ్నగా మారడమే - ఈ వివాదానికి మూలకారణంగా భావిస్తున్నారు. ముంబాయిలోని 'సీ విండ్' నివాసంలో లో వారిద్దరూ కలుసుకున్నా మాటలు మాత్రం కరువే! బలవంతంగా 'షేక్ హ్యాండ్'లు ఇప్పించినా ఒకరి మొహం ఒకరు చూసుకోరని చెబుతారు. అంతేమరి శ్రీమతుల కారణంగా చెలరేగే వివాదాల్ని చల్లార్చడం ఎవరి తరం! మళ్ళీ శ్రీమతులు పూనుకుంటే గానీ ఇటువంటి వివాదాలు సమసిపోవు!
అపర కుబేరులైన అన్నదమ్ములు - ముఖేష్, అనిల్ అంబానీల మధ్య వివాదం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని భావించిన కేంద్రం - విభేదాల్ని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీని బట్టే అంటే సోదరులు అంటే 'అంబా'నీలే అని ఎవరైనా అనాల్సిందే. 1200 కోట్ల పౌండ్లు విలువైన ఆస్తులు ముఖేష్ సొంతమైతే, 600 కోట్లు పౌండ్ల విలువైన సంపద అనిల్ అంబానీ సొంతం. స్పిల్ బర్గ్ నిర్మించే స్టూడియోలో కూడా అనిల్ అంబానీ వాటాదారుడైయ్యాడు.
Pages: 1 -2- News Posted: 29 August, 2009
|