బాబోయ్ సీఎం చాంబర్! హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి చాంబర్ లోకి వివిధ రాజకీయ పక్షాల ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసి తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులపై వినతిపత్రాలు అందజేయడం సర్వసాధారణం. అయితే, ఇటీవల ఎమ్మెల్యేలు, నాయకులు తరచూ పార్టీలు మారుతుండడం, కాంగ్రెస్ పార్టీ పట్ల అన్ని పార్టీల నాయకులు ఆకర్షితులు అవుతుండడంతో ముఖ్యమంత్రి చాంబర్ కు వెళ్ళిన ప్రతి ఒక్కరిపైనా పార్టీ మారేందుకే అనే ప్రచారం వస్తుండడంతో అటువైపు వెళ్ళాలంటేనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ఆదివారం నాడు ముఖ్యమంత్రిని కలిశారు. చిత్తూరు జిల్లాలో రెండు భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించడానికి స్వయంగా వెళ్ళానని ఆమె ముందు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశం జరుగుతుండగానే సోమవారంనాడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని ఆయన చాంబర్ లో కలిసి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు అభినందుస్తున్నట్టు న్యూస్ ఛానల్స్ లో స్క్రోలింగ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా టిడిపి శిబిరంలో కలవరం మొదలైంది.
చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కొందరు పార్టీ మారనున్నట్టు ప్రచారం సాగుతున్న సమయంలో బొజ్జల సైతం సిఎంను కలిశారనగానే ఏం జరుగుతుందో అని టిడిపి నాయకులు కంగారు పడ్డారు. బొజ్జలతో మాట్లాడిన తరువాత ఆయన చెప్పిన విషయం విని మిగిలిన ఎమ్మెల్యేలు విస్తుపోయారు.
Pages: 1 -2- News Posted: 1 September, 2009
|