ముఠాల చిచ్చు రగిలేనా? హైదరాబాద్ : తెలుగుదేశం 1983లో ఉత్తుంగ తరంగంలా విజయం సాధించడానికి కారణాల్లో ఒకటి కాంగ్రెస్ లో ముటా తత్వం పెచ్చు పెరగడం. రాష్ట్ర కాంగ్రెస్ లో సహజంగా కనిపించే ముఠాలు 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అవి మచ్చుకైనా కనిపించలేదు. కనీసం మంత్రి పదవులురాని నాయకులు 'నిరసన' ప్రకటించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ లో నిత్య అసమ్మతి వాదిగా ముద్రపడ్డ వైఎస్ హయాంలో అసమ్మతి కొంచెమైనా లేకపోవడం రాజకీయ పరిశీలకులను విస్మయపరిచింది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తారు. 1- సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాకా రాష్ట్రంలో అసమ్మతి ముఠాలను ప్రోత్సహించడం కనుమరుగైంది. 2- పాద యాత్రలతో జనంలో ఆకర్షణ పెరిగిన నేతగా రూపొందిన వైఎస్ ను సవాల్ చేయగలిగిన స్థాయి, హోదా, వనరులు కలిగిన నాయకుడు కాంగ్రెస్ లో లేకపోవడం.
ప్రధానిగా పీవీ నరసింహారావు 1991లో ఎంపికైనప్పుడు తెలుగుదేశం అభ్యర్థిని పోటీ పెట్టలేదు. తెలుగువాడు ప్రధాని అవుతున్నాడన్న కారణంగానే నంధ్యాల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలపలేదని తెలుగుదేశం అధినేత అప్పట్లో స్పష్టం చేశారు. తరువాత మరోసారి కాంగ్రెస్ లో 'తెలుగు ముద్దుబిడ్డ' అన్న ప్రశంసలు పొందిన వారిలో వైఎస్ చేరారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా వైఎస్ అసమ్మతి వాదే! రెండోసారి 1998-2000 సంవత్సరంలో పీసీసీ నేతగా పనిచేసే వరకు కూడా ఆయన అసమ్మతి వాదిగానే కొనసాగారని ఆయన సన్నిహితులు చెబుతారు. తరువాత కాలంలో సీఎల్పీ నాయకునిగా పార్టీలో అందరి ఆమోదాన్ని పొందేందుకు వైఎస్ ప్రయత్నించారు. అలాగే తెలుగుదేశాన్ని ఓడించాలన్న సంకల్పంతో పాద యాత్రలతో ప్రజలకు చేరువయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకు పోగలిగిన మరొక నాయకుడు లేకపోయారు.
Pages: 1 -2- News Posted: 4 September, 2009
|