ఇది మార్పుల మాసం హైదరాబాద్ : రాష్ట్రంలో అధికార మార్పిడికి సెప్టెంబర్ నెల 'కేంద్రం'గా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ లో ప్రమాణం చేయడం దివంగత పీవీ నరసింహారావుతో ప్రారంభమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి మొత్తం 15 మంది ముఖ్యమంత్రుల్లో ఐదుగురు తమ ప్రమాణ స్వీకారాన్ని ఈ నెలలోనే చేశారు. తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమాలతో రాష్ట్రంలో సంక్షోభం నెలకొన్న తరుణంలో 1971 సెప్టెంబర్ 30న పీవీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న కారణంగా కోస్తా జిల్లాకు చెందిన బ్రహ్మానందరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానాన్ని పీవీ భర్తీ చేశారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982లో సెప్టెంబర్ 20న సీఎంగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ లో అసమ్మతుల నేపథ్యంలో రాజకీయ సుస్థిరత కోసం అప్పట్లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం కారణంగా భవనం వెంకట్రామ్ స్థానంలో కోట్ల నియమితులయ్యారు. అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించి, రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య రథంపై పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అడ్డుకొని తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా కోట్లను తెరపైకి తెచ్చారు.
Pages: 1 -2- News Posted: 5 September, 2009
|