ఆకర్ష - 'ఆ నలుగురూ' హైదరాబాద్ : తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, తెరాస మెదక్ ఎంపీ విజయశాంతి, తాజాగా తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తమ అధినేతలపై తిరుగుబాటు ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ కు సన్నిహితం కావడానికి సిద్ధపడిన ఈ నలుగురితో పాటు ఇంకా అలాంటి ఆశ రాజకీయ జీవుల పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మిగిలింది.
ప్రతిపక్షం తెలుగుదేశంలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన శాసనసభ్యుల భవితవ్యం ముఖ్యమంత్రి వైఎస్ ఆకస్మిక మృతితో డోలాయమానంగా మారింది. వైఎస్ - 'ఆపరేషన్ ఆకర్ష్'లో నెల్లూరు జిల్లా కొవ్వూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తొలుత తెలుగుదేశం అధిష్టానం పై లేఖాస్త్రం సంధించారు. పార్టీ నాయకత్వాన్ని బాలకృష్ణకు అప్పగించాలని డిమాండ్ చేసిన ఆయన కనీసం చంద్రబాబును కలిసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి కూడా తెలుగుదేశం నాయకత్వాన్ని విమర్శించారు. తెలుగుదేశం నుంచి తన బహిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 5 September, 2009
|